పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

వాసిష్ట రామాయణము



'అన్న! [1] గోపగు నూరి - యధికారి కొదవు
నున్నత పదవి మా - కొసఁగు' మటంచు

నడుగఁగా 'నది స్వల్ప - మది, మీకు వలవ,
దడర నింకేమైన - నడుగుఁ డటంచుఁ

బలుకఁగా, 'సామంత - పదవి మా కొనఁగు
[2] మలర నిప్పు'డటన్న - 'నది యేటి పదవి?

ఇఁక మఱేమైన నే - నిచ్చెద' ననినఁ
'బ్రకటమై తగు రాజ - పదవి ని'మ్మనివ

'వివి యది మీకేల? - వేఱె వరంబు
మొనసి న న్నడుగుఁ-డి మ్ముగ నన్న వారు1500

'సకల రాజన్య శా-సనుఁడైన నృపతి
యకలంక పద మియ్యు' - మనఁగ, 'నశ్వరము

ఆరాజపదమేల?' - యన, నింద్రపదము
గౌరవంబుగ వేడఁ - గా, నతం డనియెఁ:

'దగఁ బ్రజాపతికి సి-ద్ధముగా ముహూర్త
మగువేళఁ జెడిపోవు - నయ్యింద్రపదవి,

కావున మీ రది - కాంక్షింపవలదు,
వేవేగ నడుగుఁడీ! - పేజొక్క వరము'

అనపుడు వారు 'క-ల్పాంతరంబులను
ఘనమై లయింపని - గతినీయు' మనిన1510

వాయగ్రజుండు 'క-ల్పాంతరంబులను
మాయక వెలుఁగు బ్ర-హ్మపదంబు మీకు


  1. 36 గోపుగ నూరి యధికారి కొలది.నా
  2. 37. మలయు కిప్పుడటన్న -