18
ఉపన్యాసపయోనిధి
జీవన్మతమేది?
[విజయనగర మునందలి ‘ప్రోగ్రనీవుయూనియ' అను సభవారు చేసిన వా ర్షికోత్సవసమయమున సభాధ్యక్షతను వహించిచెప్పినవాక్యములు.]
ఇప్పుడు మన దేశమునంగల మతములలో నేదినిక్కమై నజీవన్మతమో మనము తెలిసికొనవలసియున్నది. ఏమనఁ దానుజీవించి యుండినంగదా మన కుజ్జీవనమును గలిగించఁ గలుగును. ఇక్కాలమున మనదేశమునందు హిందూమత ము, బౌద్ధమతము, క్రీస్తుమతము, మహమ్మదీయమతము, బ్రహ్మసమాజమతము మున్నగు మతములు కలవుగానివాని లోముఖ్యముగా నెత్తుకొనందగినవి హిందూమతము క్రీస్తు మతము, బ్రహ్మ సమాజమతము నై యున్నవి. ఏమనఁ బూ ర్తిగా బౌద్ధాదిమతములు హిందూమతములో నైక్యమునం ది నిర్వాణము చెందియున్నవి. మహమ్మదీయమతమును వ్యా ప్తిలేక మృతప్రాయమైయున్నదనిలోకమునకు బాగుగాఁ దె లియవచ్చుచున్నది. పరికించిచూడఁ గ్రీస్తుమతమును బ్ర హ్మసమాజమతమును గూడనవసానదశయందే యున్నవి గాని యైనను మొండి ప్రాణము కలవగుటచే నింకను జీవిం చియున్నట్లు తదవలంబకులకుఁ గొంతవఱకుఁ గాన్పించుచున్న వి. కానీ హిందూమతమును గూర్చియును క్రీస్తుమతమును గూర్చియు బ్రహ్మసమాజము గూర్చియు ముచ్చటించుకొం