ఉపన్యాసపయోనిధి
19
దము. జీవన్మతమనగా నిప్పుడు సజీవమైయుండుటయేకా
కసదాజీవించి యుండునదియని భావము. జీవన్మతలక్షణము
లంగూర్చిమాక్సుమూలరు దొరవారిట్లు వ్రాసియున్నారు
"A religion which is not able thus to grow and live with us as we grow and live is dead already. Definite and unvarying uniformity so far from being a sign of honesty and life is always a sign of disho nesty and death. Every religion, if it is to be a bond of union between the wise and the foolish, the old and the young must be pliant, must be high and deep a nd broad, bearing all things The more it is so the greater its vitality, the greater the strength and warmth of its embrace.
(మనమేరీతిని అభివృద్ధిని నందుచు జీవించియుందుమో యారీతినినభివృద్ధి నందుచు జీవింపజాలని మతము ఇదివఱకే గతించినదగుచున్నది. నిశ్చితమై మార్పుచెందని యేకవిధ్య ముయోగ్యతాలక్షణమును జీవలక్షణమునగుటకు మాఱుగా నెప్పుడును నయోగ్యతాలక్షణమును మృతలక్షణమును నగు చున్నది. ప్రతిమతమును, అజ్ఞులను ప్రాజ్ఞులను వృద్ధులను బాలురను నేకీభవింపజేయు సంధానముగా నుండవలయు నెడ నయ్యది సులభసాధ్యమును గంభీరమును, నున్నతమును, విశాలమునై యన్నియంశములం గలిగియన్నిటిని నమ్మి యన్నిటిని నభిలషించి యన్నితిని సహించి నిలువగలదియై