పుట:TyagarajaDivyanamaSankeerathanaluUtsvaSampradayaKeerthamnalu.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వరలో సమాఖ్య ప్రచురించిన త్యాగరాజ పంచరత్నావలకువలెనే ఇందలి కీర్తనలకు కూడా తమ సంగీత సేవాభిలాషను పురస్కరించుకొని శ్రీ వోలేటి వెంకటేశ్వర్లుగారు స్వరాలను సమకూర్చారు.

      అయితే ఈ పుస్తక తుది వ్రాతపతి ప్రచురణకు సిద్దం అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ సంగీతనాటక అకాడమీ జనరల్ కౌన్సిలు పునర్వవస్థీకరింపబడడంతో ఈ గ్రంధ ప్రచురణ అకాడమీ చేపట్టింది.  అకాడమీ తరపున ఈ పుస్తకం అచ్చుకావడం మరింత ఉత్సాహజనకంగా ఉండగలదనే భావంతో ఇందుకు సంతోషంతో అంగీకరించింది.  ఆకారణాన ఈ గ్రంధం ఇప్పుడు సర్వాంగసుందరంగా అకాడమీ పక్షాన వెల్వడుతోంది.
    ఇందలి కీర్తనలను శ్రమ అని భావించక అనతికాలంలో స్వరపరచి మాకు అందించిన శ్రీ వోలేటివారికి మా మన:పూర్వక ధన్యవాదాలు.  ఈ ప్రచురణలో మాకు వారి సహకారాన్ని అందించిన శ్రీ నోరి నాగభూషణంగారికి, ఈ గ్రంధమును గూర్చి తమప్రశంసా వాక్యాలతో మమ్ముత్సాహపరచిన శ్రీ అరిపిరాల సత్యనారాయణ మూర్తి శ్రీ ద్వారం భావనారాయణరావుగార్లకు మా హృదయపూర్వక్ కృతజ్ఞతలు.
   ఈ గ్రంధప్రచురణకు మమ్ము పురికొల్పినవి ఏటేటా  సమాఖ్య నిర్వహిస్తున్న త్యాగరాజ జయంతుత్సవాలు.  ఈ ఉత్సవాలు ఆలంబనగా విజయవాడలో సంగీతాభిమానులకు పుణ్యక్షేత్రేం కాగల సమాఖ్య ప్రతిపాదిత త్యాగరాజ ఆలయ నిర్మాణానికి 1972 లో రాష్ట్రే ప్రభుత్వం కృష్ణాజిల్లా కలెక్టరు అద్యక్షతను ఒక కమిటీ ఏర్పరచి, రు 2500 ఆర్ధికసహాయం అందిచింది.  ఈసహాయాన్ని ఎంతొ ఆదరంతో మంజూరు చేసిన అప్పటి గౌరవ విద్యాశాఖామాత్యులు, శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారికి. ఆలయనిర్మాణానికి, సమాఖ్య కార్యక్రమాలకు ఆర్ధికంగా తొడ్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాని8కి ఈ సందర్భంలొ మా హృదయ పూర్వక అభినందనాలు సమర్పిస్తున్నాం.
       ఈ గ్రందాన్ని ప్రచురించుటకు పూనుకొన్న ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.

                                              కంభంమెట్టు వెంకట సుబ్బారావు
                                                              అధ్యక్షులు
ఏలూరు, 10-12-77 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత సభల సమాఖ్య