పుట:TyagarajaDivyanamaSankeerathanaluUtsvaSampradayaKeerthamnalu.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ వ తా రి క

       సంగీత సర్వతోముఖాభివృద్దికి కృషి చేయడం. ఈ రంగంలో పనిచేసే విదిధ సంగీతసభల యత్నాలను సమీకరించి సంఘటిత పరచడం, అనె ఆశయద్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత సభల సమాఖ్య విజయవాడలో 1961 లో స్థాపితమైంది.  తదాశయ సాఫల్యం కొరకు సమాఖ్య రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టింది.  మొదటిది 1964 లో ప్రారంభింపబడి ఏటేటా రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ప్రత్యేక అర్ధిక సహాయ సహకారాలతో 1971 వరకు నిర్వహింపబడ్డ రాష్ట్ర సంగీతోత్సవాలు. రెండవది 1967 లో దేశవ్యాప్తంగా జరిగిన త్యాగరాజ ద్విశత జయంతి ఉత్సవాల ఆధారంగా విజయవాడలో 1968 నుంచి ప్రతి సంవత్సరం సమాఖ్య నిర్వహిస్తున్న త్యాగరాజ జయంతి ఉత్సవాలు.  ఈ రెండు కార్యక్రమాలను సమాఖ్య తన సభ్య స్భల పరిపూర్ణ సహకారాన్ని అందుకొంటున్నది.
    ఈ ఉత్సవాల నిర్వహణతో పాటు, సమాఖ్య కొన్ని సంగీత గ్రంధాలను ప్రచురించింది.  త్యాగరాజ జయంత్యుత్సవాలలో ప్రధానంగా గానం చేయబడుచున్నవి.  శ్రీవారికృతులలో మణులనదగినవి. వారి ఘనరాగ పంచరత్నాలను  సర్వసహితంగా ప్రచురణ చేసి 1973 లో గానకళాసరస్వతికి సమాఖ్య తన ప్రధమ కుసుమంగా సమర్పించింది.  తరువాత సంవత్సరం, త్యాగరాజ జీవిత చరిత్రము, వారి పూజావిధానాన్ని ఒక పుస్తక రూపంలో రెండవ పుష్పంగా అర్పించింది.
   త్యాగరాజసంప్రదాయంలో భక్తి ప్రధానమైంది. 'పదవినీ సద్భక్తియు గల్గుటే ', 'నీభక్తి భాగ్య సుధానిధివీదేదే జన్మము ' 'సంగీత జ్ఞానము భక్తి వినాసన్మార్గము గలదే ' 'రామభక్త సామ్రాజ్యము ' ఇత్యాది త్యాగరాజవాక్యాలు ఇందుకు అధారాలు.  అట్తిభక్తి సుద్దీపింపజేసే శ్రీవారి దివ్యనామ సంకీర్తనలను, భక్త్యుపాసనళొ బాగాలై ఉత్సవాలలొ గానం చేయదగిన త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తనలను, భక్త్యుపాసనలో భాగాలై ఉత్సవాలలో గానం చేయదగిన త్యాగరాజ ఉత్సవ సంప్రదాయకీర్తనల్ను స్వరాలతో ఒక సంపుటిలో ఇంతవరకు తెలుగులో ప్రచురితం కాలేదు.  శ్రీవారి జయంతు త్సవాలలో వటి గానం ప్రోత్సహించి, వాటి ప్రచారానికి తోడ్పడడం విధిగా భావించి మాకు సంభవమైన కీర్తనలను సమాఖ్యపక్షాన అచ్చువేయడానికి నిర్ణయించాం.  ఇది