పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24

మును అమరత్వమునుగోరరు. వారలు మత్సేవనము నే గోరుదురు వారు ఇంద్రత్వమును, మనుత్వమును సుదుర్లభమైన దేవత్వమును స్వర్గ రాజ్యాది భోగములును స్వస్న ము న నై నను వాంఛింపరు. బ్రహ్లాదు లగు దేవతలు వినాశమునొందుదురు. కల్యాణ మగుమద్భక్తి గలవాఁడు నాశము నొందఁడు. మద్భక్తులు సుదుర్లభ నుయిన భారత భూజనము నందీ భారతమునం బరిభ్రమించెదరు. ఆనరులు భూమిని పావనము గావించి నాయాలయమున కేగుదెంచెదరు. ఓపద్మా యిది "సర్వము నీ కెఱింగించితిని. యథోచితముగఁ బ్రవ ర్తింపుము. అనిన నా కొంత లా హరియాజ్ఞానుసారముగ నడిచిరి..!

ఇది బ్రహ్మవైవర్తమహాపురాణమునందు ప్రకృతిఖండంబున

నారాయణనారదసంవాదంబున సరస్వత్యుపాఖ్యాన

మనునాఱవయధ్యాయము.