పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓం

శ్రీమత్పరదేవతాయైనమ:

పాండవ జననము

---

ప్రథమాంకము.

నాంది

మ. కరమున్ స్వచ్ఛ మొకండు వేఱొకండు రక్షశ్చక్రసంహారి భీ

కర మింకొక్కఁడు శత్రువర్గమునకున్, గాండావళీశిక్షతున్

గురు వొక్కం డరికంఠలుంఠనవిధిన్ గ్రూరం బొకం డెట్టి శ్రీ

హరి పంచాయుధముల్ గడంగి జగదాహ్లాదంబుఁ గావించుతన్

(నాంద్యంతమున సూత్రధారుఁడు ప్రవేశించి)

సూత్ర- (తెర వంకఁ జూచి) ఆర్యురాలా! సభ్యులు నాటకారంభమున కెదురు చూచుచున్నట్లు కొన్ని సూచనలు నింకను దెలియవచ్చు చున్నును, ఇంకను దెరబయలుదేరనేమి?

(నటి ప్రవేశించి)

నటి- ఆర్యపుత్రా! ప్రకృతోచిత సామాగ్రీ సంపాదన పరాయణత్వమున నింతవఱకు నాలస్య మొనరించినందులకు మన్నింపుడు. కర్తవ్యమాజ్ఞాపింతురు గాక.

సూత్ర- కర్తవ్యమున కేమున్నది? అటు చూడుము.

తే. గీ. సభయె గాదిది సంద్రమో సరసిజాక్షి!

అందు మన నాటకం బను యాసపాత్ర

మిపుడు తరియింపవలెఁ గదా! యింపు గదుర

గర్ణధారివి గా నుండి కడపు మీవు.