Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

తిక్కన సోమయాజి


పించి యుండలేదని చెప్పవచ్చును. మఱియును నతఁడు శ్రౌతస్మార్త క్రియాతత్పరుఁడై యున్నను క్రతుదీక్షను బూనియాచరించు నంతటి కర్మకుఁడుగా నున్నటులు గనుబట్టఁడు. భారత గద్యములోవలె 'బుధారాధన విరాజి తిక్కన సోమయాజిప్రణీతం'బని వ్రాసికొన్నట్లుగా వ్రాసికొనక నిర్వచనోత్తరరామాయణము గద్యలో 'బుధారాధనవిధేయ తిక్కన నామధేయప్రణీతం' బనిమాత్రము వ్రాసికొని యుండుటచేతనప్పటికిఁ గ్రతువులాచరించి యుండలేదని యూహింప వలసివచ్చుచున్నది. ఇది ప్రధమకావ్వ మగుటచేతనే కాఁబోలు 'నూత్నసత్కవీశ్వరులను భక్తిఁగొల్చి మఱివారికృషన్ గవితావిలాసవిస్తర మహనీయుఁడ నైతి నని తన వినమ్రభావముఁ దేటపఱచి యున్నను,

“చ. పలుకులపొందు లేక రసభంగము సేయుచుఁ బ్రాతవడ్డమా
     టల దమ నేర్పుచూపి యొకటన్ హృదయం బలరింపలేక, యే
     పొలమును గాని యెట్టిక్రమమున్ దమమెచ్చుగ లోక మెల్ల న
     వ్వులఁ బొరయన్' జరించుకుకవుల్ ధర దుర్విటు లట్ల చూడగన్."

అని కుకవినిరాసనమున కెడమిచ్చెను. అయిననిం దాతఁడు స్వాతిశయభావమును జూపక కుకవులమార్గమును మాత్రము నిరసించెను. ఇట్లు కుకవులమార్గమును నిరసించుటతో మాత్రము తృప్తి నొందియుండక తరువాతితెలుఁగుకవులకు నుపయుక్తములై సూత్రప్రాయములుగా నుండునట్లు,