తొమ్మిదవ యధ్యాయము
97
గలకారుణ్యము తెఱం గెఱుంగు నట్టిశ క్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించుకొని వీఁడె విజయంచేయుచున్నవాఁ”డని చూపె నఁట. అంతఁ దిక్కన సవిశేషసంభ్రమసంభరిత హృదయుండై యవ్వలను గనుంగొను నప్పుడు సర్వేశ్వరుఁ డీక్రింది స్వరూపముతో సాక్షాత్కరించె నని యిట్లు వర్ణించి యున్నాఁడు.
“సీ, కరుణారసము వొంగి తొరగెడుచాడ్పు స
శశిరేఖ నమృతంబు జూలువాఱ
హరినీలపాత్రిక సురభిచందనమున
గతినాభి ధవళపంకజము మెఱయ
గుఱియైన చెలువున నెఱసిన లోకర
క్షణ మనంగ గళంబు చాయ దోఁపఁ
బ్రథమాద్రిఁ దోతెంచుభానుబింబము నా ను
రమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప
తే. సురనదియును గాళిందియును బెరసి నట్టి
కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
నామనంబు నానందమగ్నముగ జేయ
నెలమి సన్నిథిసేసె సర్వేశ్వరుండు."
అట్లు సర్వేశ్వరుఁడు ప్రత్యక్షము కాఁగా నతఁడు భక్తియుక్తముగా సాష్టాంగదండప్రణామం బాచరించి కొంచెము దొలఁగి వినయావనతుఁడై లలాటోపరిభాగమున నంజలిపుటంబు ఘటించి నయనంబులు ప్రమదబాష్పసలిలవిలులితంబులుగను నవయవంబులు, పులకపటలపరి కలితంబులుగను నుండ నిలు