పుట:Tikkana-Somayaji.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

91


తగవులు ప్రారంభ మయ్యెను. ప్రజలు ధర్మస్వరూపమును గుఱ్తెఱుంగఁ జాలక యధర్మమార్గ ప్రవర్తకులై వ్యవహరించుటను జూచి చింతిల్లు చుండెను. తిక్కనసోమయాజికి వయస్సు ముదిరినకొలది వైరాగ్యబుద్దియు నెచ్చగు చుండెను. మనునుసిద్దియు, గణపతి దేవచక్రవర్తియు నొసంగినయగ్రహారములు భుక్తికిఁ జూలియుండుటచేత తిక్కన సోమయాజి లౌక్యాధికార పదవులమీఁది యాసక్తిని విడిచి ధర్మానురక్తి గలిగి తనజీవితమును లోకహితార్థము వినియోగింప బ్రతిజ్ఞచేసి సంకల్పసిద్ధుఁడయ్యెను. ప్రజలకు సమస్తధర్మములను బోధించునది. పంచమవేద మనంబరగు మహాభారతము సంస్కృతభాషయందుండుట చేత జనసామాన్యమునకు దుర్గ్రాహ్యమై యుండెను. ఆంధ్రు లజ్ఞానాంధకారములో మునిగియుండి భాసురభారతార్థముల భంగుల నిక్క మెఱుంగనేరక గాసటబీసటలే చదివిఁ గాథలు త్రవ్వు చుండెడివా రని యెఱ్ఱాప్రెగ్గడ వక్కాణించెను. [1] ఆంధ్రులకు భారతధర్మముల నాంధ్రభాషమూలముగా బోధించుటయే పరమార్థముగా గ్రహించెను. ధర్మాద్వైతమతసాంప్రదాయము లాంధ్రులకు సులభసాధ్యము లగుటకుమార్గము

  1. "ఉ. భాసురభారతార్థముల భంగుల నిక్క మెఱుంగ నేరమిన్
         గాసటబీసటే చదివి గాథలఁ ద్రవ్వు తెనుంగువారికన్
         వ్యాసముని ప్రణీతపరమార్థము తెల్లఁగఁ జేసి నట్టియ
         బ్జాసనకల్పులం దలంతు నాద్యుల నన్నయతిక్కనార్యుల౯."
                                                (నృసింహపురాణము)