పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

' శకుంతలా! నువ్వు లేవకు, తలగడపై చెయ్యి ఉపధానం చేసుకొని పడుకో! నీ మీద నా పాట నీకు అంకితం ఇవ్వాలి, నీవు రాణివి, నేను నీ కవిని.

' ఓ దేవీ! నీ దివ్యజన్మకే నాడు సర్వస్వమ్ము ఇత్తునో! నా జన్మ,నా బ్రతుకు, నా కలలు ఏ జీవితాద్భుత రహస్య మ్మొ ప్రత్యక్ష మొనరింపవచ్చేనో ప్రజ్వలిత మొనరింపవచ్చేనో! ఆ దివ్య సిద్ధియే నీవునై ఆ దివ్య మోక్షమే నీవునై నీ పరమ పాదాబ్జముల నేను! నీ పవిత్ర హృదయాన నేను.'

   అని పాడి, మంచముకడ  మోకరించి, పరుపు  అంచుననున్న  ఆమె పాదాలపై  నా మోము నంచినాను. ఆమె లేచి  నా చేతులు  రెండును పట్టి  తనకడకు  లాగుకొని, నీరు తిరుగు కన్నులు  వాన వెలిసిన చంద్రకాంతిలా  మెరిసిపోవ, నా మోము చూస్తూ ' మీరు  నా దేవుళ్ళు, నా సర్వస్వమూ మీలోని  భాగం,  మిమ్ము  మీరు పూజించుకొంటారా? మనం  ఇద్దరం కలిసి పూర్ణ రూపం  అవుతాము. ఆ పూర్ణపురుషునిలోని దివ్యత్వం మీరు, నేను మానవత్వాన్ని, నేను మిమ్ము పూజించాలి. అదే  కాదూ, సీతా, సావిత్రీ  మొదలైన  వాళ్ళు  చెసిందీ?  అదే నిజం!' అన్నది.        

శకూ! పురుషుడు ఇంతవరకు మనుష్యుడు. ప్రపంచంలో కృషి చేసేవాడతను. అతని జాతికి అమృతత్వం ఇచ్చి, అతనికి వెనకాల బలమైన స్త్రీ అతనిలోని దివ్యత్వం.

    ఈ రోజున  నాలో  ఏదో  పవిత్రత  వచ్చింది, మీకూ, నాకూ అర్థం  కాని  ఏదో మహాభావం  నాలో చేరినట్లు నా కల  నాకు భావం  కలిగిస్తున్నది
                                                                                                                     14
   మా  అత్తగారైన  వెంకటరావమ్మగారు  శలాకలా  పొట్టిగా, బంగారు బొమ్మలాంటి మనిషి. ఎంత ఈడువచ్చినా  చిన్న బిడ్డలా  ఉండే కాయ శరీరం కల ఆరోగ్యవంతురాలు.  చారెడేసి కళ్ళూ, ఉంగరాలు తిరిగిన జుట్టూను.  ఎనిమిది కాన్పులు వచ్చినా  ఇద్దరు బిడ్డలు మాత్రమే బ్రతికి ఉన్నారు. అయినా  ఆమెలోని యవ్వనపు  బిగి ఏమాత్రమూ  సడలలేదు. తల్లీ, పెద్ద కొమరిత కలిసి వస్తూఉంటే  అప్ప చెల్లెళ్ళలా  ఉండే వాళ్ళు. ఆమె వెర్రిబాగుల మనిషి. ఆమెకు లోకంలోని  వాళ్ళందరూ మంచివాళ్ళే. అనవసర సంబంధాలు  కలుగచేసికొనేదికాదు. కాని తన దృష్టి  పథంలోకి వచ్చిన  వాళ్ళనందరినీ  నిష్కలష్మమైన  ఆ పేక్షతో చూచేది. భర్త అంటే  ఎంతో గౌరవం, భక్తి.