పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేను  : వెర్రిఅమ్మాయీ, నేనూ అందరితోటి వాణ్ణే! ఈ లోకంలోని పరమ రహస్యాలన్నిటిలోనూ సంచరించాను. పరమ పవిత్ర ప్రదేశాలలోనూ సంచరించాను. ఆ అనుభవము తప్ప నాలో ఇంకేమీ లేదుసుమా.

    నామాటలకు ఆమె ఆలోచనలో నిమగ్నమయినది. నేనూ ఆలోచనా లీనుడ నయ్యాను. ఆ ఆలోచన లటుంచి మళ్ళా కథ ప్రారంభిస్తాను.