పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూడయ్యాయ్. మా మాష్టర్ నాకు ఎంతో తొందరగా సంగీతం వస్తుందన్నాడు.

   నేను: అంతా బడాయ్! నీకు సంగీతం కూడా వస్తుందా!
   శకుం: నీకు బంతి ఆట వస్తుందా! బడాయికి బ్యాట్ తెచ్చుకొన్నావు.
   నేను: గుంటూరు వచ్చి చూడు తెలుస్తుంది.
   శకుం:నేను సంగీతం పాడుతుంటే వచ్చి విను!
   నేను: ఓ తాయిలంగారికి నేను తెచ్చిన బొమ్మలన్నీ యిస్తావా?
   శకుం: నేను తాయిలంగారికోసం కుట్టిన జేబురుమాళ్ళు యిస్తానా
  

నేను: నాకూ ఉన్నాయి కావలసినన్ని జేబురుమాళ్ళు.

శకుం: నాకూ ఉన్నాయి కావలసినన్ని బొమ్మలు.

నేను: అయితే నేను తక్షణం యింటికి వెళ్ళిపోతాను.

శకుంతలకు కన్నీళ్ళు తిరిగినయి.

   అమ్మా, మూర్తి బావ నా మీద కోపం వచ్చి నా జట్టు ఉండకుండా వెళ్ళిపోతున్నాడే! అని కళ్ళనీళ్ళు తుడుచుకొంటూ కోపంతో గిర్రున తిరిగి లోపలి హాలులోకి వెళ్ళిపోయింది. గుమ్మం దగ్గరే వాళ్ళ   నాన్నగారు నుంచుని  ఏమిటి తల్లీ! బావమీద కోపం వచ్చిందా? అని గబుక్కున ఎత్తి గుండె  కదుముకొన్నారు. నా హృదయం ద్రవించిపోయింది. నా కంఠము బరువెక్కినది. పైకిరాని నా కంటినీరు నా  కళ్ళను మండించినవి. తండ్రి మెడ కౌగిలించుకొని శకుంతల వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆయన భుజములో  మోమును దాచుకొన్నది.
   వినాయకరావుగారు  ఇదేమిటోయ్, ఎప్పుడూ లేనిది,ఇద్దరూ దెబ్బలాడుకొన్నారు! ఏమిటా తగాదా? అని ప్రశ్న వేశారు.
   శకుంతల గభాలున తండ్రి మెడ చుట్టిన చేతులు వదిలి,క్రిందకు జారి నా దగ్గరకు పరుగెత్తుకొని  వచ్చి,బావా నామీద కోపము పోలేదూ? అని  అడిగినది.  నాకు కోపము లేదు: వేళాకోళంగా  అన్నాను అని నవ్వాను. నే నివ్వాళ   మీ  యింట్లోనే భోజనం చేస్తాను. రా, మా యింటికి పరుగెత్తి  వెళ్ళి, నా పెట్టేతీసి నీ బొమ్మల్ని ఇస్తాను. ఆ పెట్టెంతా నీ కోసం తెచ్చిందే! వెళ్ళిరామా, మామయ్యగారూ!అని తలవాల్చే వినాయకరావు  మామగారి  నడిగినాను. పరుగెత్తుకొని వెళ్ళండి అని ఆయనగా రన్నారు. చేతులు చేతులు పట్టుకొని, మా హృదయాలు కలిసి మెలిసి, మా నవ్వులు పైకి పొర్లి  ప్రవహించి మేము గాలిలో మా యింటికి తెలిపోతిమి.
   నాకు పదమూడవ యేడు జరుగనప్పుడే, వినాయకరావుగారికి రెండవ కుమారిత జన్మించినది. శకుంతల ఒక్క నిమిషం చెల్లెలిని వదిలి ఉండేది కాదు. చెల్లెలికి హైమావతి అని వినాయకరావుగారు నామకరణం   చేసినారు. హేమకుసుమదేవి అని ముద్దు పేరయినది. చెల్లెలిని వడిలో పడుకో పెట్టుకొనేది. చెల్లెలి  ప్రక్కలో  పడుకోనేది. చెల్లెలి మాటలే సర్వదా నాతో చెప్పేది. ఒకనాడు