పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏ తార చాయలో నినుగాంచె అని రాయప్రోలు సుబ్బారావుగారన్నట్లు బావను కన్నది. ఈ ఇంటిలో తాను కోడలై తన బావ ప్రేమను తాను పాలిస్తూ వుండడంకన్న ఉత్తమం ఏముంది? అనుకుంటూ మేడమీడకు గబగబ మెట్లెక్కి వెళ్ళి బావా! బావా! అని పెద్దకేకలువేస్తూ, నవ్వుతూ అతని గ్రంథాలయ మందిరంలోకి వెళ్ళింది. అతడక్కడలేడు. అతని పడక గదిలో లేడు, అత్తగారి పడకగదిలో లేడు. అలంకారపు గదిలో లేడు. వరండాలో లేడు.

   ఆమెకు ఏదో భయం  వేసింది  తిన్నగా  క్రిందకు  దిగి,  బావ మేడమీద  లేరండీ అత్తయ్యా?  అని  వంటింటిలోకి  వెళ్ళి చెప్పింది.
   రంగనాయకమ్మగారు ఈవలకు  వచ్చి  ఒసే  ముత్యాలూ!  అని  కొల్లిపరనుంచి తమతో వచ్చిన పనిమనిషిని పిలిచింది.
    ఇక్కడున్నానండీ  అంటూ  ముత్యాలు వచ్చింది.
    అయ్యగా  రేరీ? 
    ఆరు బొమ్మలమేడ  కెళ్ళారండీ అని  ముత్యాలు జవాబు చెప్పింది.
    నేను వెళ్ళి  తీసుకువస్తానత్తయ్యా!  అని హేమ  ఈ  మేడ  తోటలో  నుంచి,  ఆ మేడ తోటలోనికి  ఆ  ఫిబ్రవరి చేమంతుల  అందాలలో  స్నాత  అగుతూ, గబగబ చందాల  నడకలతో వెళ్ళింది.       
   రెండు తోటలకు మధ్యనున్న  చిన్న  తలుపు  తెరచుకొని, ఆ బాలిక  దీపాలతో  వెలిగే  ఆ శిల్పభవనంలోకి  పోయింది. ఇదివరకే ఆమెకు  ఆ శిల్ప భవనం  అత్యంత  పరిచితము.
    బావా! ఎక్కడున్నావు? అని ఆమె  వణికే హృదయంతో  లోనికి వెళ్ళింది.
   త్యాగతి  చిత్రమందిరంలో పద్మాసనంమీద  కూరుచుండి, రెండు చిత్రాలు  పక్కపక్కనే  ఎదుట పెట్టుకొని  కన్నులరమూతలుగా, ఏదో ధ్యానసముద్రలో ఉన్నాడు. అతని కన్నులు  నీరు  తిరుగుతూ  నిశ్చలకాసారలలో సుడులలమినట్లున్నాయి.
                                                                                                                 7
   హేమ  వచ్చినట్లు  త్యాగతి  గ్రహించనేలేదన్నట్లు  తదేకదీక్షతో  పద్మాసనం వేసుకొని  ఉన్నాడు. హేమ మెల్లగావెళ్ళి, అతని ప్రక్కను కూర్చుండి  ఆ రెండు  చిత్రాలు చూచింది.
   ఆ రెండు చిత్రాలు  హేమవే! కాదు-ఒకటి హేమే కాని, హేమ కాదా ఏమిటి? అన్నట్లూ ఉంది. ఆమె  కన్నులలోని  నీరు గమనించి  హృదయంలో  వణకిసోయింది. పైకి లేని ధైర్యం  తెచ్చుకొని  బావా! ఈ రెండు బొమ్మలూ  ఎప్పుడు  వేశావు? 
   హేమకు తెలియకుండా కంటనీరు  తుడుచుకొని, కొంచెం డగ్గుత్తికతో హేమా! ఒకటి  మీ అక్కది. ఆమె  నన్నువదలి వెళ్ళబోయే ముందు  స్థితి.