పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తేమభావంవల్ల ఎడ్వర్డు చక్రవర్తి రాజ్యం వదులుకున్నాడు ఓ అమ్మాయినో, ఓ అవ్వనో చేసుకొనడానికి. యుద్ధం నడిపే నాయకుడు తనకు నచ్చిన ఆడది కనబడితే ఆ రోజు యుద్ధం ఆపాడన్నమాటే. నేపోలియను అంత వీరాధివీరుడు మేరి వారియోన్స్కావల్ల రష్యా యుద్దంలో తన్నులు తిన్నాడు. చివరికి నాశనమూ అయ్యాడు.

   ఎందుకు స్త్రీల బ్రతుకు  యిలా అయింది? తన బావ శ్రీనాథమూర్తి జీవితం  అంతా  శకుంతలా భావం  నిండి వుందట? శిల్పం  సృష్టించే మొనగాడు తానేనా? అందుకో  శకుంతల  కావాలా? దాని వెనుక  సుశీలా, విల్హె ల్మినా, ఇంకా ఓ  వేయిమంది ఆడవాళ్ళా? మహానుభావుడు!  తాను శిల్పకళ ఉద్దరించకపోతే ప్రపంచం  తలక్రిందులవుతుందా?  ఈ  నంగనాచి మాటలు  ఆడది  అనలేదా? సత్యరాజా  అపూర్వ  జైత్రయాత్రలో ఆడమళయాళం అద్భుతంగా వుంది. వస్తే గిస్తే ప్రపంచం  అంతా  ఆ  పరిస్థితులు రావాలి. అప్పుడు  శ్రీనాథమూర్తులు,  గీనాథమూర్తులు భోగ   పురుషులవుతారు. లేదా, వితంతువులై ముక్కులు  తెగకోయించుకుంటారు.
   రాష్యాయే తనకు  బాగా  నచ్చిందని  హేమ అనుకుంది. ఆడది యెందుకు ఈ  కులుకుల  మిఠారి  కావలసి వచ్చింది? పక్షుల్లో, జంతువుల్లో  కులికేది మగపక్షి,  మగజంతువూ. పనిచేసే  కూలిపిల్ల నలుగురు   మగవాళ్ళను  పళ్ళూడకొట్టగల బలం  కలది  కూడా, మగవాడు కనబడేప్పటికి వాలుచూపులు చూస్తుంది. చిరునవ్వుల మాల  పెదవులపై వేలాడ వేస్తుంది. పయిట  జారవిడుస్తుంది.  రష్యాలో  మాత్రం  ఆడది  యుద్దానికి  తయారైనా పక్కనున్న  సైనికుడి  పెదవులమీద  ఇంత  అధరామృతం కురిపిస్తూనే  విరోధి  గుండెల్లో అగ్నివర్షం  కురిపిస్తుంది.
   అన్ వింకర్సులో  సింక్లెయిరు లూయీ వ్రాసినట్లు, దేశాల  సర్వ  వుద్యమాలూ  నడిపే  స్త్రీలు కూడా  పక్కలోకి  పశువు కావాలనే అంటారు. కాంగ్రెసు ఉద్యమంలో, యింకా అన్ని ఉద్యమాలల్లో, ఉత్తమనాయిక లెందరో  అలాంటి కక్కుర్తుల  పాలవటంలేదు?  కాలేజీ బాలికల చరిత్ర  ఒక పీడకలే! ఆడపిల్లలున్నారని మగవాళ్ళంతా  భోగంవాళ్ళలా  వేషాలు వేసుకొని  అందరూ క్లార్క్ గేబుల్, ఫ్రెడ్ ఆప్టెయిరు, ఫ్రెడ్  మాక్  ముర్రే, డాన్ ఆమెచీలు ఆనుకుంటూ వస్తారు. అందుకు  ప్రతిగా ప్రతి  బాలిక  హెడ్డీలా మేరీ, డయానా డర్బిన్, కాతరైన్ హెస్ బరన్  అనే  అనుకుంటారు. ఛీ! ఛీ! 'వుమెన్ ' అనే చిత్రం  ఆడవాళ్ళ  స్వేచ్ఛా, నిరర్థకత్వం చాడటానికి తీశాడు మగాడు. గుడిపాటి వెంకటచలం చచ్చురాతల స్వేఛ్చ ఆడది  అందరి   మొగవెధవల పక్కలో పడుకునే  స్వేచ్ఛ! దేశంలోవున్న ప్రతి ఆడదీ ఆ  నాగమ్మగారి పక్క  పండాలనా ఆయన ఉద్దేశం?
   ఇంతకూ  తనుమాత్రం  ప్రపంచానికి అందాల అందాలబరిణ, చిన్నారి చిలక, పొన్నారి పోక  అనిపించుకుందామని  ప్రయత్నం చేయటం లేదా? అలా  తనతోటి విద్యార్థినులలో ఎవరు చేయటంలేదు? నిజంగా  ఆలోచిస్తే, సంసారా