పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవును మూర్తీ, నఖాలతో తవ్వి కొండ పెకలించాలని ప్రయత్నిస్తే అతడు భంగపాటు పొందాడట. కాని ఆ త్రవ్వడం వల్ల ఈ హ్రదం ఏర్పడిందట.

    మనవాళ్లవి ఏమి  విచిత్ర  భావాలండీ! ప్రతిప్రకృతి వై చిత్ర్యానికి ఒక  చక్కని  గాథ కల్పిస్తారు.
    కల్పించడం  అంటే  నీ  ఉద్దేశం?
    లేనిది  సృష్టించడమనే!
    లేనిది  ఎవరికి?
    ........
    అందరికీనా?
    అవును.
    ఉందని  గుర్తించే వస్తువు  ఉందని  ఎల్లా  తెలుస్తుంది?
    చూపులు  చుస్తే, మనస్సు  గ్రహిస్తుంది.
    చూపులు చూచినా, మనస్సు గ్రహించకపోతే?
    చూచినా, ఒకటే, చూడకపోయినా ఒకటే.  
        
    అంటే__చూపులు నిమిత్తమాత్రం, మనస్సు  అసలుశక్తి  అని  గదా నీ వాదన. సరే, చూపులు లేకుండా మనస్సు గ్రహిస్తే?
    మనస్సు  గ్రహించడానికి  ఏదైనా  మార్గం  వుండి తీరాలండీ.
    మనస్సుపై  అధికారి  అనుకో. పైఅధికారికి   వచ్చే విన్నపాలు  క్రింద  వున్న  అధికార  సోఫానం  వెంట  వస్తవనుకో. ఆ అధికారే  క్రింద  అధికారులతో  సంబంధం              లేకుండా తానే స్వయంగా  విషయం దర్యాప్తు  చేసుకొని, విషయాన్ని  గూర్చి  తీర్పు  ఇవ్వగలడా?
    ఇవ్వగలడండీ. కాని  ఈ  పోలిక  సరియైంది  కాదు. తెలుపురంగు  ఒక వస్తువు  ఆధారం  లేకుండా  వ్యక్తం  కాదు.
    విశ్వంలో  విద్యుచ్ఛక్తి వుంది. అది  ఉపాధి  ద్వారా  వ్యక్తం  అవుతుంది. కాని  ఉపాధి కూడా  ఆ విద్యుత్  స్వరూపమే  అని  కదా  శాస్త్రజ్ఞులంటారు. అంటే విశ్వంలో  వున్న  ప్రతీ  అణువూ ఎలక్ట్రాన్, ప్రోటాన్ మొదలైన  సూక్ష్మాతి  సూక్ష్మశక్తికణాల  కూడికనేనా   మీ  ఉద్దేశం?  ఆ  విద్యుత్  వ్యక్తం  కావాలంటే  తనతో  చేయబడిన  వస్తువుద్వారా  వ్యక్తమవుతుంది. మనస్సు  నుంచే  సర్వప్రకృతీ  ఉద్భవించింది. సర్వప్రకృతిలోని  వస్తువు మనస్సు. ఆ  మనస్సు  ఒక  ఉపాధిద్వారాగాని వ్యక్తం  కాకపోవచ్చును. కాని మనస్సు  ఉపాధి  అవసరం  లేకుండా  వుండి, ఇతర  విషయాలను  గ్రహిస్తుంది కదా?  
                                                                                                                         
           
               

చిత్తం.

   అలాటి మనస్సు  సృస్టించిన  ఈ  విచిత్ర  భావాలు  వట్టి  కల్పనలెలా అవుతవి  మూర్తీ?  మనస్సు  ఇంద్రియాలను  ఉద్భవింపజేసినట్లే, భావాలనూ  ఉద్భవింపజేస్తుంది.  భౌతికమైన  ఈ  పదార్థా  లేలాంటి సత్యమో  భౌతికేతరమైన   భావాలూ  అలాంటివే. కనుక  ఒక  భౌతిక  విషయం    ఎంత  ఆనందదాయక  మౌతుందో, మానసిక