పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేను: ప్రాణంగలవన్నీ పెరుగుతున్నాయి కదా? పదేళ్ళనాటి జనాభా నూటముప్ఫైకోట్లయితే, ఇప్పుడు ప్రపంచంలో నూటయాభైకోట్లపై చిల్లర పెరగలేదా? అందులో ఏ కొద్దిమందో తప్ప తక్కినవాళ్ళు భగవద్భావాన్ని నమ్మినవాళ్ళే కదా? ప్రకృతిలో మనుష్యులు తప్ప తక్కిన ప్రాణి కోట్లకు భగవంతుడున్నాడని, లేడని భావాలు లేవు కదా? ఒకవేళ వున్నా ఉన్నదీ లేనిదీ మనకు తెలియదు. అనేకరకాల ప్రాణికోట్లు నశించాయి. వానిలోంచో, విడిగానో కొత్తప్ర్రనికోట్లు ఉద్భవించాయి. వానికి పురోగామి కావాలని గాని, ఆగిపోదామనిగాని ఆలోచన లేదు. వాని పెరుగు విరుగులు ఆ పురిగామిత్వం మీద ఆధారపడి వుండలేదు. వాని పెఉగు విరుగులు ఆ పురోగామిత్వం మీద ఆధారపడి వుండలేదు. కనుక నువ్వు మనుష్యుని పురోగామిత్వ తిరోగామిత్వాల విషయమై మాత్రమే కదా?

   మూర్తి: అవునండీ, మనుష్యుడు  వృద్ధిపొందడమే, ఆరోగ్యవంతుడవడమే, సర్వసంపదలు సమంగా అనుభవించడమే కోరుతాడు. అంటే, మనుష్యు డార్థిక ప్రాణి. ఆర్థికంగా సమత్వం కోరుతాడు. అది రావాలంటే  భగవంతుడు, కర్మ, మోక్షం, నిర్యాణము, మళ్ళీ జన్మ  అనే  భావాలు అతని  పురోభివృద్దికి  అడ్డాలు కదా?
   నేను: అర్థిక  సమత్వం  కోరేవాడికి  భగవంతుడు  వద్దని  చెప్పాడా అంటే,  ఒక  మనుష్యునిలో   వున్న భగద్భావం   నువ్వు  ఆర్థికంగా సమంగా  ఉండకు అని బోధిస్తుందా?
   మూర్తి: అంటే, మనుష్యుడు తనలో వున్న  హెచ్చు  తగ్గులు  అది కర్మనుంచీ వస్తున్నాయనిన్నీ, కర్మ  కూడా  భగవత్స్వరూపమనిన్నీ, హెచ్చు  తగ్గులు  వుండడమే భగవంతుని  ఇచ్చ అనీ  నమ్మి, పెద్ద  అలసత్వం  సంపాదించుకొని,  తన ప్రయత్నాల నుండి  విరమించి, నిస్పృహ పొందుతున్నాడు  కదా అండీ? 
   నేను: ఇంతవరకు  భగవద్భావమే  లోకం అంతా  నిండివున్నదికదా. ఏ  చార్వాకులో , ఏ  ఇంగర్ సాల్  వంటి  వాళ్ళో  దేవుడు  లేడని  వాదించవచ్చు. అంతే. కాని  భగవంతుడున్నాడని  నమ్మేవారు  కోట్లు  వున్నారు. అయినా  ఒక పరిణామం నుంచి  యింకో  పరిణామం  వస్తూనే  వుంది. రాజ్యవిధానాలు, శాస్త్రవిధానాలు, జీవిత విధానాలు  అనేకం  మార్పులు  పొందాయి. ఆ  మార్పులన్నీ  చాలా  ఉత్కృష్టాలైన  మార్పులని  మీరంతా  వాదిస్తూనే  వున్నారు. భగవద్భావం ఎల్లా  తీసుకువచ్చిందా  మార్పులు? మీ  తండ్రి  భగవంతుని  నమ్మితే,  లేడని  వాదించగలిగిన  నీవెలా  ఉద్భవించగలిగావు? నువ్వు పురోగమ స్వరూపానివా? తిరోగమ  స్వరూపానివా? అలాగే  లెనిన్ తండ్రో,  తాతో  భగవంతుని నమ్మినవాడే కదా! ఆ  వంశంలో  భగవంతుని  నమ్మిన  లెనిన్  ఉద్భవించాడు?
                                                                                                                           
           
               

మూర్తి: నన్ను ఆలోచించుకోనియ్యండి.

   మూర్తి  నాకు  నమస్కరించి వెళ్ళిపోయాడు. ప్రజలు  భగవంతుడున్నాడని ఒప్పుకుంటే యేమి ఒలికింది. లేకపోతే  యేమి  నష్టమైంది?  భగవంతుని  పేరిట