పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూడు రోజులనుకున్న మకాము ఆరు రోజులయింది. రోజూ స్నానాల ఘట్టానికి ఉదయమే వెళ్ళి, పదింటికి, పదకొండింటికి ఇంటికి వచ్చేవాణ్ణి. మా సుబ్బులు ఆడవాళ్ళ ఆ దృశ్యాలు చుస్తే ఎవరైనా తంతారేమోనని భయపడ్డాడు. మా అమ్మ నానాటికి చిక్కిపోతోంది. ఓనాడు నన్ను నాన్నా! లక్నో, హరిద్వారం, హృషీకేశం చూద్దామురా? అన్నది.

   మే  రెండవ వారంలోనే  సుక్కూరు  నుంచి  షికార్  పూర్, కరాచీ, క్వెట్టా  చూడకుండానే  చిన్న బండిమీద  ఢిల్లీ, అక్కడనుంచి ఆగ్రా, ఆగ్రానుంచి కాన్పూరు, లక్నో చేరుకున్నాము.  లక్నో  అయోధ్యలు  చూచి హరిద్వారం  చేరుకున్నాము. ఎండలో  మాడిపోయాము.
                                                                                                                   
                                                                                                                  28
   నా  హృదయానికి, నా మనస్సుకు, నా బుద్దికి  వనితాలోకం తప్ప  ఇంకొకటి దృశ్యం  కావటమేలేదు. ఆడవాళ్ళ ద్వారా  భగవంతుని పైనా,  ప్రపంచంపైనా  కసి తీర్చుకోవాలి. ఆస్తిపోయినవాడికి  లోకంలో ధనమంతా   వాడి ఆస్తే. అలాగే  భార్య పోయిన  నాకీ  స్త్రీ  దాహం  విపరీతం అయింది. దాహం తీర్చుకోలేని  వ్యాధి  పీడితునిలా  ఆ  వనితా  జలధివెంట  తిరగడమే కాని, అందులో  మునగలేదు.
   శుఠను  కాలేని  శుద్ధ  హీనాత్ముణ్ని.  నన్నీ  నారీలోకమంతా  హేళన చేస్తోందని భావించాను. వాళ్ళను హేళన చేశాను.  మా  ప్రయాణాల్లో వాళ్ళు వింటూండగా  మా  సుబ్బులుతో   ఆడవాళ్ళను   ఎత్తిపొడవడం, వాళ్ళను శంకించడం, దుర్భాషలాడడం సాగించాను. కొందరు  మగవాళ్ళు  ఆ  మాటలను  వింటూ  నన్ను  ఎత్తిపొడిచారు, కొట్టవచ్చారు. ఒకసారి రైలు  కుడా   ఆపుచేసేటంతవరకు వచ్చింది.
    అప్పుడే  ఒక మహిళారత్నం  నా  వైపు  తిరిగి, పూర్వీభాషలో  ఓ అబ్బాయీ! ఇందాకటినుండీ   నీ    పేలుడంతా వింటున్నాను. నీ మొగం  చుస్తే  జబ్బుతో ఉన్న మనుష్యునిలా  కనబడుతున్నావు.  మీబోటి  తుచ్ఛులు  మా  స్త్రీలను  చేసే  అవమానం  మితిమీరిపోతూ ఉంది.  నీకు కనబడేది  స్త్రీల దేహమా, వాళ్ళ అందమా?  వాళ్ళ తెలివి  అంతా   వాళ్ళ  అందమైన  అంగాలలో ఉందా?  వాళ్ళు భోగవస్తువులా?   వాళ్ళు పురుష  వాంఛలు తీర్చడానికి పుట్టారా?  నీ  తప్పుల  హిందీ  ప్రలాపాలు  వింటూంటే  నువ్వు  మదరాసి వాడిలా కనబడుతున్నావు.  మదరాసీ మగవాళ్ళు  మా ఉత్తరాది  మగవాళ్ళకన్న   పెద్దమనుష్యు లనుకున్నాను.  ఛీ! ఛీ! ఏమి  బ్రతుకయ్యా నీది!
    రా, నీకు  ఆడవాళ్ళు  పశువులో, దద్దమ్మలో, శక్తి  రూపిణులో చూపుతా, మా  లక్నో  స్త్రీ మండలి  అఖేడాకు. నీలో   ఇంతైనా  మానవత్వం  ఉంటే ఈలాంటి  నీచ ప్రలాపాలు  కట్టిపెట్టి  నోరు  సర్వకాలం మూసుకుని  ఉండే  ప్రయత్నం  చేయి. లేదంటావా, నేనే  నాలుగు  లెంపకాయలు  తగిల్చి  నీ  జబ్బు  కుదురు