పుట:Thobithu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. ధనమును కూడబెట్టుకొని దుష్టజీవితమును జీవించుటకంటె చిత్తశుద్ధితో ప్రార్థనము చేయుట, మంచి జీవితమును జీవించుచు దానధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకొనుటకంటెను దానముచేయుటమేలు. 9. దానము మిమ్మ మృత్యువునుండి కాపాడును. మి పాపముల నెల్ల కడిగివేయును. దానము చేయువారు దీర్గాయుష్మంతు లగుదురు. 10. పాపపు పనులను దుష్కార్యములను చేయువారు తమకు తామే కీడు తెచ్చుకొందురు.

11. రాజును గూర్చిన రహస్యమును గుప్తముగా నుంచవలయునని దేవుడు చేసిన మేళ్లను ఎల్లరికి ప్రకటింప వలయునని నేను ముందుగానే చెప్పితిని. ఇప్పడు ఏమియు దాపక మికు పూర్ణసత్యమును తెలియజేసెదను. 12 తోబీతూ! నీవు సారా ప్రార్థనము చేసినపుడు మి మనవులను నేను దివ్యసన్నిధిలో అర్పించితిని. నీవు చచ్చినవారిని పాతిపెట్టినపుడును నేనట్లే చేసితిని. 13. నీవు భోజనమునకు కూర్చుండి అన్నము తినకయే లేచిపోయి పీనుగును పాతిపెట్టి వచ్చినపుడును ప్రభువు నీ విశ్వాసమును పరీక్షించుటకు నన్ను పంపెను. 14 మరియు నీకు ఆరోగ్యదానము చేయుటకును నీ కోడలు సారాను పిశాచపీడనము నుండి విడిపించుటకును దేవుడు నన్ను పంపెను. 15. నేను దేవుని దివ్యసన్నిధిలో నిల్చి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగానుండు ఏడురు దేవదూతలలో నొకడనైన రఫాయేలును."

16. ఆ పలుకులు విని ఆ తండ్రి కొడుకులు భయకంపితులై గడగడ వణకుచు నేలమిూద బోరగిలపడిరి. 17. కాని దేవదూత వారితో "మినారు భయపడకుడు. మికెట్టి కీడును కలుగదు. ప్రభువును సదా కీర్తింపుడు. 18. నాయంతట నేను మి యొద్దకు రాలేదు. మికు తోడ్పడుటకు ప్రభువే నన్నుమి చెంతకు పంపెను. కనుక మిరా జీవితకాలమంతయు ఆ ప్రభువును కీర్తింపుడు. 19. మికు నేను భోజనము చేయుచున్నట్లే కన్పించితిని. మి దృష్టికి అట్లు కన్పించితినేగాని నేను యథార్థముగా భోజనము చేయలేదు. 20. మిరు ఈ భూమిమిద ప్రభువును స్తుతించి కీర్తింపుడు. ఇపుడు నేను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/31&oldid=237529" నుండి వెలికితీశారు