పుట:Thobithu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీకు స్వాగతము". తోబీతు ఆ దినము నీనెవెలోని యూదుల కందరికి విందుచేసెను. 18. అతని సోదరుని కుమారులైన అహీకారు, నాదాబు కూడ ఆ విందునకు వచ్చిరి.


11. రఫాయేలు

12.1. వివాహోత్సవము ముగిసిన తరువాత తోబీతు కుమారుని పిల్చి "నాయనా! నీ నేస్తునికి వేతనము చెల్లింపవలయునుగదా! అతనికి మన మొప్పకొనిన దానికంటె ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము" అని చెప్పెను. 2. కుమారుడు తండ్రితో "నాయనా! నన్నీతనికెంత చెల్లింపుమందువు? మేము తెచ్చిన సౌత్తులో సగమితనికిచ్చినను నష్టములేదు. 3. ఇతడు నన్ను సురక్షితముగా నీచెంతకు గొనివచ్చెను. గబాయేలు నొద్దకు వెళ్ళి మన సొమ్మను తీసికొని వచ్చెను. నా భార్యకు భూతవిముక్తి నీకు రోగవిముక్తి కలిగించెను. ఈ యుపకారములన్నిటికి గాను ఇతని కెంత సొమ్మ చెల్లింపు మందువు?” అని యడిగెను. 4. తోబీతు అతడు కొనివచ్చిన సొత్తులో సగము పంచియిమ్మ అతడు అంత వేతమునకు అరుడు అని చెప్పెను. 5. కనుక తోబియా రఫాయేలును పిల్చి "నేస్తమా! నీవు తీసికొనివచ్చిన డబ్బులో సగము పుచ్చుకొనుము. నీవు నాకు చేసిన మేలునకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మిగా యింటికి బొమ్మ అని చెప్పెను.

6. అప్పడు రఫాయేలు ఆ తండ్రికొడుకులను ప్రక్కకు పిల్చి వారితో నిట్లనెను. “మిూరు ప్రభువును స్తుతింపుడు. అతడు మిరాకు చేసిన యువకారములను ఎల్లరికిని విదితము చేయుడు. అప్పడు ఇతరులు కూడ ఆ ప్రభువును సన్నుతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికి తెలియజేయుడు. మినారు ఎన్నడును అతనిని స్తుతించుట మానవలదు 7. రాజును గూర్చిన రహస్యమును ఎవరికిని చెప్పకుండుట మేలు. కాని దేవుడు చేసిన మేలును ఎల్లరికిని ప్రకటించుట మంచిది. అప్పడు అందరును అతనిని గౌరవింతురు. మిరు మంచిపని చేయుదురేని మికెట్టి కీడు కలుగదు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/30&oldid=237528" నుండి వెలికితీశారు