పుట:Thittla gnanam.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూతులు కూడ స్థానము చేసుకొని అజ్ఞానుల నోటిలో నానుచున్నవి. జుగుప్సాకరముగ, అసహ్యముగ ఉన్న భూతుమాటలను కొన్ని పల్లె ప్రాంతములలో తిట్లుగ వాడుచున్నారు. భూతుమాటలే తిట్లు, అసలైన తిట్లు శాపనార్థములుగ కొందరి లెక్కలోనున్నవి. నేటి కాలములో నున్న భూతుమాటను, దూషణలను, దీవెనలను వివరించి చెప్పి వాటికి సరియైన అర్థమిదని చెప్పడమే ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక పాఠకులందరు సదుద్దేశముతో చదివి అర్థము చేసుకోవలెనని కోరుచున్నాము.

ఇట్లు

ఇందూ ధర్మప్రదాత

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు

IGV logo
IGV logo


అసత్యమును వేయిమంది చెప్పిన అది సత్యము గాదు,

సత్యమును వేయిమంది కాదనిన అది అసత్యము గాదు.