పుట:Thittla gnanam.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కాలములో దూషణలుగ కన్పించుచున్నప్పటికి వాటివలన శుభమే చేకూరును. కావున దూషణలుగ కన్పించు వాక్యములను దీవెనలుగ చెప్పుచున్నాము. దైవజ్ఞానమున్నపుడే దూషణలేవి, దీవెనలేవని తెలియగలదు. జ్ఞానములేని వారికి వాటి తారతమ్యము తెలియదు, కనుక ఇపుడు మేము చెప్పిన తిట్లలో గల జ్ఞానమును, దీవెనలలో గల అజ్ఞానమును వారు అర్థము చేసుకోలేక పోవచ్చును. కొంత జ్ఞానము తెలిసి చూడగలిగితే తిట్ల జ్ఞానము దీవెనల అజ్ఞానము సులభముగ అర్థము కాగలదు. ఈ పుస్తకములో కొన్ని దీవెనలను, కొన్ని దూషణలను మాత్రమే తెలియజేసాము. ఇంకను మనము చెప్పుకోని మరికొన్ని దీవెనలు మరికొన్ని దూషణలు కూడ గలవు. వాటిని కూడ జ్ఞానముతో యోచించి చూచినపుడే వాస్తవముగ అవి ఏవో తెలియగలదు.


నేటికాలములో తిట్లను కొంత పరిశీలించితే వాటి స్థానములో వాటివలెనున్న కొన్ని వాక్యములు చోటు చేసుకొని ఉన్నాయి. వాస్తవముగ అవి తిట్లు కాక పోయిన తిట్లవలె చలామణి అగుట చోద్యముగనున్నది. భూతుమాటలను కొన్నింటిని దూషణలుగ కొందరు వాడుటవలన వాస్తవమైన దూషణలను కూడ భూతులుగ, భూతులను దూషణలుగ తలచుటకు అవకాశము గలదు. అర్థముండునవి దూషణలని, అర్థములేక కేవలము భూతులతో కూడుకొన్న మాటలు దూషణలుకావని గుర్తించవలెను. పూర్వము దూషణలను కాని, దీవెలను కాని జ్ఞానము కల్గిన గురువులు చెప్పెడివారు. కాలక్రమేణ పద్దతులు మారిపోయి దీవెనల స్థానములో దూషణలు దూషణ స్థానములో దీవెనలు నిలచిపోయి వాటిని జ్ఞానములేనివారు కూడ చెప్పడము జరుగుచున్నది. అంతేకాక పూర్వకాలము దీవెనలు నేటికాలపు తిట్లుగ చలామణి అగుచుండగ వాటి స్థానములో