పుట:Thimmarusumantri.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠప్రకరణము

91


విద్యా గోష్ఠి

ఈమంత్రి శిఖామణి సంస్కృతాంధ్రములందు నసామాన్యపాండిత్యము గలవాఁడు. కర్ణాటాంధ్రపారసీకభాషలలో వ్యవహారము జరుపనేర్చిన వ్రాయసకాడు. పలుభాషలు ముచ్చటింపనేర్చిన ప్రెగ్గడ. ఇతఁడు సంస్కృతమునం దపారమైన ప్రజ్ఞ గలవాఁడగుటకు సగస్తేశ్వరవిరచితమైన సంస్కృత బాలభారతమునకు నితఁడు చేసిన వ్యాఖ్యయే గొప్పనిదర్శనముగాఁ జూపవచ్చును. ఇతఁడు సంస్కృతాంధ్రసాహిత్యము గలవాఁ డగుటచేతనే ప్రసిద్ధకవీంద్రు లనేకు లీకృష్ణదేవరాయని యాస్థానమునకుం జేరుకొనిరి. వారిలోఁ ప్రధానులు అల్లసాని పెద్దనామాత్యుఁడును, నంది తిమ్మనామాత్యుఁడు నై యుండిరి. మొదటివాఁడు నందవరీకనియోగిబ్రాహ్మణుఁడు; రెండవాఁ డార్వేలనియోగి బ్రాహ్మణుఁడు. వీరు మహాకవులుగాఁ బరిగణింపఁబడు చున్నను కృష్ణరాయని కాలమున మండలాధికారులుగఁ గూడ నుండిరి. వీరు నిరంతరముసు రాయని వెంబడించి యున్నవారు గావున వీరిని మంత్రివర్గములోఁ జేర్పవచ్చును. వీరికి రాయనికడ సర్వస్వాతంత్ర్యమును గలదు. వీరి కిట్టిసమ్మానము గలుగుట సాళువ తిమ్మమంత్రీంద్రుని భాషాపక్షపాతమును, కవిత్వమునందలి ప్రేమయును దక్క వేఱొండు గారణము గానరాదు. బొడ్డుచర్ల తిమ్మనామాత్యుఁడను కవీంద్రుఁ డొకఁడు కలఁడు. అతఁడు రాయనితోఁ జతురంగ మాడుటకై