పుట:Thimmarusumantri.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

తిమ్మరుసు మంత్రి


కార్యము వారలనుండి తొలఁగించి సైన్యమునంతయును దనవశము చేసికొని బలపఱచి యెప్పుడు యుద్ధము తటస్థమైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నుండునట్లు గావించెను. కృష్ణదేవరాయఁడు పరరాష్ట్రాధిపతులతో నెప్పుడు యుద్ధము చేయవలసి వచ్చినను నెంతమాత్రమును సైన్యములకొఱఁత లేకుండ బదిలక్షల సైన్యమును సిద్ధముచేసెను. ఈసైన్యముల వెచ్చమునకుగా నమరనాయకులనుండి కప్పములను కొనుచు సైన్యముల మీఁది యధికారమును తిమ్మరుసుమంత్రి రాయనిపై నుంచెను. అతని యధికారమును వీరువా రనక యెల్లవారును శిరసావహింపవలసినదే. ముప్పదియాఱువేల గుఱ్ఱపుదళమును రాయఁడు స్వయముగాఁ బోషించునట్లు చేసెను. ఎనుమిదివందలయేనుగులనుగూడ రాయఁడు పోషించుచుండెను. ఈరెండు సంవత్సరములలోను గావలసినంత ధనమును బొక్కసములోనికి జేర్చెను. ప్రతి సంవత్సరమును విజయదశమినాఁడు రాయఁడు తన సేనలను బరీక్షించి సైనికులకు బహుమానములు మొదలగునవి చేయునట్లుగ నేర్పాటు గావించెను. ఇట్టి యేర్పాటుల యొక్క ప్రయోజనమును జక్కఁగా గ్రహించి శ్రీకృష్ణదేవరాయఁడు తనజన్మము సార్థక్యము నొందింప భూతలముపై నవతరించిన దేవగురునిగా తిమ్మరుసును సంభావింపుచుఁ నాతనికిఁ గృతజ్ఞుఁడై తనవలన నాతనికి నాతనివలనఁ దనకు లోకముస గౌరవము కలుగునట్లుగాఁ జాలకాలము ప్రవర్తించెను.