పుట:Thimmarusumantri.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

తిమ్మరుసు మంత్రి


లోకనిందకుఁ బాత్రముగాకుండ నుండు విధమునఁ గార్యసానుకూల్యము గావింతునని యాప్రభునకు వాగ్దత్తముచేసెను. అంతఁ గొన్నిదినములకు శ్రీరంగపట్టణాధీశ్వరుం డగు వీరశ్యామలరాయని పుత్త్రికయగు తిరుమలమ్మ నిప్పించి కృష్ణరాయనికి వివాహము గావించెను. ఆవివాహమహోత్సవమంతయు ముగిసినవెనుక నొక మహాభవనమును నిర్మింపించి యందు తిరుమల్దేవిని చిన్నాదేవినిఁ బ్రవేశపెట్టించెను. నాఁట నుండియు రాయఁడును, ప్రభువులును, ప్రజలును చిన్నమ్మను గూడఁ బట్టపురాణిగ భావించి చిన్నాదేవి యని సమ్మానించు చుండిరి. తిరుమల్దేవికిని చిన్నాదేవికిని భేదమునెంచకయే యుభ

  • చిన్నాదేవి వేశ్యాంగనాపుత్రికయని కృష్ణరాయని సమకాలీనులగు 'పేయస్, సన్నిజు' అను పోర్చుగీసు చరిత్రకారులు వివరముగా వ్రాసియుండుటచేత నిది యధార్థమని యొప్పుకొనక తప్పదు. శ్రీకృష్ణదేవరాయని యాస్థానకవులుగా నుండి స్వారోచిషమనుసంభవమును, పారిజాతాపహరణమును వాని కంకితము గావించిన అల్లసాని పెద్దనామాత్యకవియు, నందితిమ్మనామాత్యకవియుఁ గూడ :-

“క. ఆవిభుననంతరంబ ధ
    రావలయముఁ దాల్చె గృష్ణరాయఁడు చిన్నా
    దేవియు శుభమతి తిరుమల
    దేవియునుం దనకుఁ గూర్చు దేవేరులుగాన్. "
                                              (మనుచరిత్రము)

“క. శ్రీ వేంకటగిరి వల్లభ
    సేవాపరతంత్రహృదయ చిన్నమదేవీ
    జీవితనాయక కవితా
    ప్రావీణ్యఫణీశ కృష్ణరాయమహీశా. "
                                              (పారిజాతాపహరణము)