పుట:Thimmarusumantri.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమప్రకరణము

"సీ. సర్వజ్ఞుఁ డగుమంత్రి నవదరించినరాజు
            కార్యఖడ్గమ్ములక్రమ మెఱుంగు
     కార్యఖడ్గంబులక్రమ మెఱింగినరాజు
            బహువిధముల మూలబలముఁ గూర్చు
     బహువిధముల మూలబలము గూర్చినరాజు
            శత్రుల నవలీల సంహరించు
     శత్రుల నవలీల సంహరించినరాజు
            ధరణి యేకాతపత్రముగ నేలు

     కావున మహాప్రధానాగ్రగణ్యుబుద్ది
     యధిపుసామ్రాజ్యమునకు సర్వాంగరక్ష
     రాయమలవీరగండ : వీరప్రచండ !
     గుండభూపాలు నరసింహమండలేంద్ర !"

అని మున్ను సాళ్వనారసింహభూపాలుని యాస్థానకవీంద్రుఁడు చెప్పిన చందమున మహాప్రధానాగ్రగణ్యునిబుద్ధియే యధిపుని సామ్రాజ్యమునకు సర్వాంగరక్ష యనుమాట యధార్థము. సర్వజ్ఞుండని చెప్పందగిన తిమ్మరుసుమంత్రి బుద్ధియె యీయభినవకర్ణాట సామ్రాజ్యమునకు సర్వాంగరక్షగా నుండెననుట యతిశయోక్తిగాదు. తిమ్మరుసువంటి మంత్రిసత్తము డుండుటచేతనే కృష్ణదేవరాయనివంటి చక్రవర్తి యుండుట సంభవించెను. అరటిపండొలిచి చేతి కందించినరీతిగా నేవిధ