Jump to content

పుట:Thimmarusumantri.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(11)

చతుర్థ ప్రకరణము

67


మరణించువఱకు నెవ్వనికిఁ గానుపింపకుండ నామందిరముననే దాఁగొని యుండుమని యాతని కభయహస్తమిచ్చి వెంటనే యొక యాఁడుమేఁక కన్నులను దెప్పించి పట్టుకొనిపోయి ప్రాణముల విడువనున్న వీరనరసింహదేవరాయనికిఁ జూపించెను. అతఁ డాకన్నులను జూచి సంతోషించి కుమారుని తిమ్మరుసున కప్పగించి యాక్షణము ప్రాణములను విడిచెను. అంత నర్హ విధానమున సంస్కారవిధుల నివర్తింపఁజేసి కృష్ణరాయనిఁ జక్రవర్తిగాఁ బ్రకటించెను.


__________