పుట:Thimmarusumantri.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

తిమ్మరుసు మంత్రి


యఁడు పూర్వజన్మ సుకృతవిశేషమునను, దైవానుగ్రహము వలనను, తిమ్మరుసు మంత్రి కృపావిశేషమునను విద్యను, శరీరదార్ఢ్యమును, రాజనీతి నైపుణ్యమును మాత్రమెగాక పరస్త్రీయెడ సోదరీభావము నలవర్చుకొని తిమ్మరుసు నడిపిన విధముగా నడిచి యాతనికి ముదంబుఁ గూర్చుచుఁ బ్రజానురంజకుఁడై ప్రవర్తించుచుండెను.

నరసరాయనిమృతి.

ఇంతలో క్రీ. శ. 1503 వ సంవత్సరమున నరసరాయనికి నుబ్బుజాడ్యము జనించి దినక్రమమున నభివృద్ధి నొంది తుదకు భయంకరమైనదిగాఁ బరిణమించెను. తాను జీవించెద నన్నయాశను విడిచిపెట్టెను. ఒకనాఁడు నరసరాయఁడు తిమ్మరుసును బిలుపించి యిట్లనియెను.

“అమాత్యవర్యా ! నాకవసానకాలము సమీపించినది. ఇఁక నాబ్రదుకు దినములమీఁద నున్నదిగాని మాసముల మీఁద లేదు. ఇంతవఱకు రాజ్యభారమునంతయు నీమీఁద విడిచిపెట్టినందులకు నామాట దక్కించి సామ్రాజ్యము సముద్దరించి వన్నెయు వాసియుఁ గల్పించితివి. నిన్ను నమ్మి నేనిఁక సుఖముగాఁ బ్రాణములను విడువఁగలను. నాసామ్రాజ్యమును నాబిడ్డలను నీకప్పగించుచున్నాఁడను. ఈ సామ్రాజ్యము నీచే సురక్షితము కాఁగలదు. ఈబిడ్డలు నీచే సురక్షితులు కాఁ గలరు. నా వెనుక వీరనరసింహదేవరాయనికిఁ బట్టము గట్టుము. అతఁడు నీప్రాఫునను, కృష్ణరాయనితోడ్పాటునను ప్రజానురంజ