పుట:Thimmarusumantri.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము

51


కృష్ణరాయని విద్యాభ్యాసము.

శత్రువులవలన నేయపాయమును గలుగకుండ సంరక్షించుటకై పితృవాత్సల్యముఁ బూని కృష్ణరాయనికి రక్షకునిగా తిమ్మరుసుమంత్రి ప్రజ్ఞాధ్యుఁడైన తనతమ్ముని గోవిందరాజును నియమించెను. అతనికిఁ దానును గోవిందుఁడును విద్యాబుద్ధులు గఱపుచుండిరి. పదునెన్మిది సంవత్సరముల ప్రాయము వచ్చునప్పటికి నాంధ్రగీర్వాణభాషలయందు సాహిత్య జ్ఞానమును సంపాదించెను. కర్ణాటభాషయు, హిందూస్థానీభాషయు నభ్యసించెను. సాముగరిడీలం దేఱెను. ధనుర్వేద పారంగతుఁ డయ్యెను. అశ్వారోహణమునందు గడితేఱి తురగ రేవంతుఁడనఁ బ్రసిద్ధిగాంచెను. తిమ్మరుసు వాని బుద్ధికౌశల్యమునకు, తన యెడంగల భక్తికి సంతసించి రాజనీతి, దండనీతి మొదలగు రాజ్యతంత్రవిధానముల స్వయముగా నేర్పి మహిమోన్నతుని గావించెను. కృష్ణరాయఁడు సుందరాకారుఁడు. చక్కని ముఖవర్చస్సు గలవాడు. పొట్టియు, బొడవును గాక కాయపుష్టికిం దగినపొడవు గలవాడు. అతని ముఖముమీఁద స్ఫోటకపు మచ్చలుకలవు గాని ముఖవికాసము చూచినప్పుడు మాత్రము సార్వభౌమత్వమును స్ఫురింపఁ జేయునట్టిరీతి గానం బడుచుండును. దేహమును దిట్టపఱచి సుస్థిరముతోఁ గదన భూమి దృఢముగ నిలుచుటకై కృష్ణరాయఁడు ప్రతిదినమును విడువకుండ శరీరసాధనము సలుపుచుండెను. ఇట్లు కృష్ణరా