పుట:Thimmarusumantri.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

తిమ్మరుసు మంత్రి


రుసు చెవిని బడక మానదు. ఇట్లనుటవలన నంతఃపురమందిరములఁ గాని సామ్రాజ్యమునఁగాని యీతనికిఁ బ్రతిపక్షులు లేరని గాని యీతడు తలపెట్టుకార్యములకుఁ బ్రతివిధానములఁ బన్ని విఘాతము చేయఁజూచువారు లేరని కాని చెప్ప సాహసింపరాదు. ప్రథమకర్ణాటరాజవంశమును సముద్దరింపవలయినని తత్పక్షపాతులై సమయ మపేక్షించి వేచియున్నవారు గొందుఱు గలరు. ఈ మహాసామ్రాజ్యమునకు సాళువనరసింహభూపతి సంతతియే యాధిపత్యము వహింపవలసిన వారుగాని యన్యులు కారని యిమ్మడి నరసింహరాయలను వజ్రసింహాసనారూఢుని గావించి సామ్రాజ్యమును సొళ్వరాజవంశమునకే నిలుపవలయునని ప్రయత్నించువారు గొందఱు గలరు. అనేక కారణములచే నిట్టి మహాపదవిని వహించి సమస్తసామ్రాజ్యాధికారధూర్వహుడై ప్రవర్తించెడి తిమ్మరుసునెడఁ 7వల మసూయాపిశాచగ్రస్తులై ప్రతిపక్షులుగా నుండెడివారు మఱికొందఱుగలరు. వీరెల్లరును తిమ్మరుసునెడఁ గలభక్తిచే విధేయులై యుండిరని తలంపరాదు. అత్యధికమైన ప్రతిభయు అప్రతిమానమైన ప్రజ్ఞయు అత్యద్భుతమైన మేధాశక్తియు అకళంకమైన సామ్రాజ్యభక్తియు అత్యనురూపమానమైన సమర్థతయు, అప్రతిబద్ధమైన యాజ్ఞయు, వీనిమించిన యౌదార్యమును, క్షాత్రమును, బ్రహ్మతేజస్సును ప్రతిపక్షుల భయకంపితులను జేయఁగా వారెల్లరును తిమ్మరుసు ననువర్తించువారైరి. సాళ్వనరసింహభూపాలుని పుత్రుఁడైన యిమ్మడి నరసింహరాయని