పుట:Thimmarusumantri.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(8)

చతుర్థ ప్రకరణము

47


పెనుగొండ రాజ్యమున కధిపతిని గావించి వానిని వానికుటుంబమును పెనుగొండదుర్గమున నుండునటులు నియమించెను. ప్రథమకర్ణాటరాజవంశమునెడఁ పక్షపాతము గలవారి కెవ్వరికిని విద్యానగరమున గొప్పపదవు లేవియు నొసంగియుండలేదు. కర్ణాటకులవలన నేవిధమైస యుపద్రవమును మూడకుండ వారిలో సమర్థులై యిష్టులుగా నున్నవారికి గోప్పపదవుల నిచ్చి కర్ణాటప్రజల మెప్పునుగూడఁ గాంచుచుఁ గర్ణాటకులకుఁ దెలుగువారికి వై మనస్యములు పెరుఁగకుండఁ జూచుకొనుచుండెను. కర్ణాటదేశముసఁ దెలుఁగువారికిని, తెనుఁగు దేశమునఁ గర్ణాటకులకు నధికారపదవు లొసంగుచుండెను. తనకు నలువది యేండ్లు నిండకపూర్వమె మహామాత్యపదవిని బొంది మహాకర్ణాటరాజ్యచక్రమును జేతబట్టుకొని విదేశీయరాజ్యతంత్రజ్ఞులు సయితముఁ “జే" యని ప్రస్తుతింప హస్తనైపుణ్యము వన్నె కెక్కునట్లుగా గిరగిర దిప్పుచుండెను,

{{}p|fs125|ac}తిప్పాంబ కౌటిల్యము.

ఏమి హేతువుచేతనో చెప్పజాలము కాని నరసింహదేవరాయఁడు తిప్పాంబకంటెను నాగాంబికయం దెక్కువ ప్రేమమును జూపుచుండెను. దీనివలన తిప్పాంబకు నాగాంబికయం దసూయ జనించెను. తిప్పాంబకుమారుఁడై న వీరనరసింహదేవరాయఁడు నాగాంబకుమారుఁడైన కృష్ణదేవరాయనికంటెను వయస్సునఁ బెద్దవాఁడు. తిమ్మరుసుమంత్రినే నాగాంబికాపుత్త్రుఁ