పుట:Thimmarusumantri.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయ ప్రకరణము

37


పక్షమున జేరి రెండవపక్షము నోడించితిమేమి మొదటిపక్షము వారు మనకు సులభసాధ్యు లగుదురు. శత్రువులను జయించుట కిదియొక మార్గము. మఱియు వారిలోవారి కైకమత్యము కలుగకుండ వారిలో వారికి మనస్పర్ధలను గలిగించు చుండవలయును. అందువలన వారిబలము తగ్గిపోయి సులభసాధ్యు లగుచుందురు. ఇది యొకవిధమైన రాజనీతి. కాశింబరీదు మన సాహాయ్యము నపేక్షించెను. గావున మనము చేయు సాహాయ్యము మనకే లాభించునదిగా నుండవలయును. కనుక కృష్ణా తుంగభద్రానదుల నడుమ నుండుదేశము అనగా ముదిగల్లు రాచూరు దుర్గముల మనమాక్రమించుకొందుము. అని చెప్పి కాశింబరీదునకు వర్తమానముచేసి కొంతసైన్యముసు బంపించి యా దుర్గములను వానిచుట్టు నుండుదేశము నాక్రమించుకొని యెను. ఆదిల్‌షాహ యేమియుఁ జేయజులక కొంతకాల మూరకుండవలసినవాఁడయ్యెను.

కోనేరినాధుని దుండగము.

సాళువనరసింహభూపాలుని కాలముననే సాళువ తిరుమలభూపాలునికి బిమ్మట మహామండలేశ్వరుఁ డైన కోనేరినాథుఁడు తిరుచునాపల్లి మండలమునకుఁ బరిపాలకుఁడుగా నియమింపఁబడి ప్రజాపాలనము సేయుచుండెను. ఇతఁడు శైవుఁ డైనందున జంబుకేశ్వరాలయమునెడఁ బక్షపాతము గలిగి శ్రీరంగము లోని రంగనాధుని యాలయథర్మక ర్తలను నానావిధముల