పుట:Thimmarusumantri.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

తిమ్మరుసు మంత్రి


రుసు తన మూఁడవ మేనల్లుని గోపనమంత్రిని గుత్తిదుర్గాధ్యక్షునిగా నిర్ణయించి తన తమ్ముని స్థానమునందు నిలిపెను. [1] ఇంత వఱకును అప్పనయు గోపనయు దండనాధులుగ నుండిరి. ఇప్పుడు తిమ్మరుసు వీరలను గొప్పరాజ్యములకుఁ బాలకులనుగ నియమించెను. కొండవీటిరాజ్యమునకు గోపనమంత్రిని, వినుకొండ, గుత్తిరాజ్యములకు అప్పసమంత్రినిఁ బరిపాలకులుగా (గవర్నరులను) నియమించెను. కృష్ణరాయని సామ్రాజ్యమున మంత్రులకును గొప్ప సేనానులకు నెట్టిమర్యాదలు జరుగుచుండెనో అట్టిమర్యాదల నన్నిఁటిని వీరు పొందుచుండిరి. వీరలు సంసృతాంధ్రభాషలయందు మంచిపాండిత్యము గలవారు. అప్పనమంత్రి మాదయగారి మల్లనకవివర్యునిచే రాజశేఖరచరిత్రము నంకితము నొందెను. వీరి దానశాసనములు కొండవీడు, వినుకొండ సీమలలోఁ బెక్కులు గానవచ్చుచున్నవి. వేద వేదాంగ విదులైన బ్రాహ్మణోత్తముల కసేకుల కగ్రహారములను భూముల నొసంగిరి. దేవస్థానములను జక్కపఱచి దాన ధర్మములను గావించి సంరక్షించిరి. చేఱువులను ద్రవ్వించిరి. మహాకార్యము లెన్నో యాచరించి విఖ్యాతిఁ గాంచిరి. అప్పన మంత్రియు గోపనమంత్రియును రామలక్ష్మణులవలె నన్యోన్య

  1. "ఉ. ప్రాపితరాజ్యవైభవనిరాకృతపాకవిరోధి యైనయా
         గోవనమంత్రి ధర్మథనగోపనసమ్మతిగుత్తి దుర్గల
         క్ష్మీపరిపాలవక్రమనమిద్దభుజాబలగాలిరూపరే
         ఖాపరమత్స్యలాంఛనుఁడ యాహవకార్య దురంధరుండిలన్,
                                         (రాజశేఖరచరిత్రము)