పుట:Thimmarusumantri.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(19)

నవమప్రకరణము

127


ప్రియులై యలరిరని మాదయగారి మల్లన కవీంద్రుఁడు నొక్కి వక్కాణించి యున్నాఁడు. [1] తిమ్మరుసు దేశమునం దెచ్చటను శత్రువులను లేకుండఁజేసి దేశమున శాంతి నెక్కొలిపి మేనల్లుండ్రను బ్రతినిధిపాలకులనుగా నారాజ్యములందు నిలిపి విజయోత్సాహముతో రాజధానికి వచ్చి రాయనిచే వనేకవిధముల సమ్మానింపఁబడియెను.

రాచూరిదండయాత్ర

తిమ్మరుసుమంత్రి రాజధాని ప్రవేశించిన వెనుకఁ గొన్ని సంవత్సరములు యుద్ధములు మాని రాజ్యంగవ్యవహార సంస్కణంబున మాత్రము బుద్దినిజొనిపి ప్రజాసౌఖ్యమునకై పాటుపడియెను. అయినను క్రీ. శ. 1520 వ సంవత్సరములో గృష్ణరాయఁడు విజాపురసుల్తానుపై దండెత్తిపోయి తురుష్కులను జయించి రాచూరు ముదిగల్లు దుర్గములను బట్టుకొని స్వాధీన పఱచుకొనియెను. అదిల్ షాహ రాజధాని యగు విజాపురమును విడిచి పాఱిపోయెను. ఈదండయాత్రలోఁ దిమ్మరుసు మాత్రము పాలుగొని యుండలేదు. తిమ్మరుసు తమ్ముఁడు గోవిందరాజు మాత్రము ముష్పదివేల కాల్బలముతో రాయని

  1. కం. ఆయనుగుందమ్ముఁడు విన
        యాయతమతిఁ గొల్వ నప్పనార్యుఁడు నతఁడున్
        బాయక యన్యోన్యప్రియు
        లై యలరిరి రామలక్ష్మణాకృతు లగుచు౯.
                                    (రాజశేఖరచరిత్రము.)