పుట:Thimmarusumantri.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమప్రకరణము

105


వశము గావించి యాతనికి నగరాధ్యక్షపదవి నొసంగి యిట్లనియెను. తమ్ముఁడా! మేము పూర్వదిగ్విజయ యాత్రకు వెడలఁ బోవు చున్నారము. నీవు సేనాధిపతులలో శ్రేష్ఠుఁడవనియు, సమర్థుఁడ వనియు రాయఁడు నిన్ను శ్లాఘించి నగరాధ్యక్షత్వమును వహించుటకు నీవ యర్హుండవని నొక్కి వక్కాణించి నందున నతనిచే ననుజ్ఞాతుఁడనై నీపైన నీగొప్ప భారమును నిలిపినాఁడను. నీవు నగరసంరక్షణభారము మాత్రమే గాక తురుష్కులు తమ సరిహద్దులను దాఁటి రాకుండఁ జూచు భారముగూడ నీపైనఁ బెట్టుచున్నారము. మనమెందఱినో యలక్ష్యముచేసి కృష్ణదేవరాయన్ని బట్టాభిషిక్తునిఁ గావించితిమి. అతఁడును అతని సామ్రాజ్యమును వర్ధిల్లు మార్గమును జూచుట మనకు విధ్యుక్తధర్మమై యున్నది. అతఁడు మనల నమ్మి సామ్రాజ్యము మనచేతఁబెట్టి యున్నవాడు. కనుక నతని శత్రువులవలన నేవిధమైన యపకృతియుఁ గలుగకుండుటకై యెందఱో సమర్థులైన సేనానులున్నను నమ్మికలేక నిన్నే యీపదవియం దుంచుటకు గారణమైనది. తమ్ముడా ! ఏమఱి యుండెదవేని నీకును నాకును ప్రొణోపద్రవము గలుగుటయె గాక సామ్రాజ్యమునకును వినాశము గలుగవచ్చును. కావున నగరమును వేయి కన్నులతో వీక్షింపుచు భద్రముగాఁ గాపాడుచుఁ గీర్తిగనుము. అని యాతని కనేకవిధములై న రాజనీతివిధానంబుల నుపదేశించి రాయని దండయాత్ర నగరంబునఁ బ్రకటించుమని యూజ్ఞాపించి పంపించెను.