పుట:Thimmarusumantri.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

తిమ్మరుసు మంత్రి


లెవ్వరు? బ్రాహ్మణులు కారా! పరశురాముఁ డెవ్వఁడు? బ్రాహ్మణుఁడు కాఁడా! పూర్వకాలమున నెందఱో బ్రాహ్మణు లస్త్రవిద్యాభ్యాసముఁజేసి లోకమున వన్నె కెక్కి యుండలేదా? మీ నియోగి బ్రాహ్మణులు లౌకికతంత్రమునందు మాత్రమేగాక యుద్ధతంత్రములందును నాఱితేఱినవా రనుటకు పూర్వకథలె మనకు సాక్ష్యము లీయఁగలవు. ఇంతయేల ! అప్పా! మీ తమ్ముఁడు దండనాధులలో శ్రేష్ఠుఁడు, ఎన్నియుద్ధములలో విజయుఁడై యుండలేదు? మీరు బ్రాహ్మణులై నను క్షత్రియులను మించిన క్షాత్రము గలవారు. అన్నిటికంటెను ముఖ్యముగా మీరు బ్రాహ్మణు లగుటంజేసి మాకు విశ్వాసపాత్రులైరి. మీరెప్పుడును సామ్రాజ్యముయొక్క క్షేమము నభిలషించుచుందురు. అదియ మాకుఁ గావలసిన ప్రధానవిషయము. కావున నాప్రార్థనమును మన్నించి నేను జెప్పినట్లు చేయుము. మీతమ్ముని రాజధానీనగరాధ్యక్షునిగా నియమింపుము. నిన్ను సర్వసేనాధిపత్యంబునకుఁ బట్టంబు గట్టెదను. ఇందులకు మాఱు చెప్పకుము. అని ప్రార్థించెను.

అంత నమ్మంత్రిపుంగవుడు రాయని ప్రార్ధనమును మన్నించి తాను సర్వసేనాధిపత్యమును వహించుటకు నంగీకారము నిచ్చి యాతనిచే దండయాత్ర కనుజ్ఞాతుఁ డయ్యెను.

నగరాధ్యక్షుని నిర్ణయించుట

అట్లు రాయనిచే ననుజ్ఞాతుఁడై తిమ్మరుసుమంత్రి లక్ష సైన్యమును నగరసంరక్షణార్థము గోవిందామాత్యదండనాధుని