పుట:Thimmarusumantri.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమప్రకరణము

101


సామాన్యమైనది కాదు. మఱియు నతఁడు మతాంతరుఁడు గాఁడు. అతని సైన్యాధిపతు లనేకులు తెలుఁగువారై యున్నారు. అందువలన దేశములోని ప్రజలు తురుష్క-ప్రభువుకంటె నీహైందవప్రభువునే యెక్కువగా బ్రేమింతురు. కనుక గజపతివలననే మన కెక్కువచెడుగు కలుగవచ్చును. వీనిని మన తెలుఁగు దేశమునుండి తఱిమివేయుట ప్రథమకర్తవ్యము. మఱియు బహమనీరాజ్య మైదుభాగములుగా భిన్నమై యైకమత్యములేని సులాన్తులచేఁ బాలింపఁ బడుచున్నది. వారలను విడిగా జయించుట బహుసులభసాధ్యము. ఒకవేళ మనము ముందుగా విజాపురసుల్తానుపై దండయాత్ర వెడలుద మనుకొనుము. ఏవురు సుల్తాను లేకమై మనపైఁ గడంగవచ్చును. అప్పుడు వారలను జయించుట కష్టసాధ్యము గావచ్చును. ఆయదను గనుపెట్టి శ్రీవీరప్రతాపరుద్రగజపతి మనరాజధానిపై దండెత్తివచ్చెనేని మనసామ్రాజ్యమునకు ముప్పు వాటిల్లుట నిశ్చయము. మనము ముందుగా ప్రతాపరుద్రగజపతిని జయింతుమేనిఁ దరువాత తురుష్కులను జయించుట సులభసాధ్య మగును. మనము పూర్వదిగ్విజయయాత్రకు బయలువెడలి నప్పుడు విజాపురసుల్తానులతో నిదివఱకె యొడంబడిక చేసికొని యున్నారముగనుక మనమీఁద యూరక దరడయాత్రకుఁ బ్రయత్నింపఁడు. ఒకవేళ దుర్బుద్ధిపుట్టి తన సైన్యముతో మన రాజధానిపైఁబడి యాక్రమింపఁ జూచునేని వాని నవలీల జయించునట్టి సైన్యమును విశ్వాసపాత్రుఁడైన యొక సేనాని