పుట:Thimmarusumantri.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

తిమ్మరుసు మంత్రి


క్రిందనుంచి రక్షణము గావింపవచ్చును.

ఈమహానగర సంరక్షణభారము నెవ్వనిపైఁ బెట్టుదునాయని యోజించుచున్నాను. దీనిభారమును వహించువాఁడు విశ్వాసపాత్రుఁడైనవాడుఁగా నుండుటమాత్రముగాక సమర్థుఁడుగాఁగూడ నుండవలయును. ఏసేనాని చిత్తమెట్టిదో పరీక్షించి తెలిసికొనుట కష్టసాధ్యము. ఎవ్వరును గానుపింపకున్న నేనే యీమహాకార్యమును నిర్విహింపఁ బూనుకొనఁదలంచి యున్నాఁడను.

అని తిమ్మరుసు ప్రత్యుత్తరమీయ రాయం డిట్లనియెను. అప్పా! నీవు నుడివినమార్గము భాగుగా నున్నది. అవశ్యము పూర్వదిగ్విజయయాత్రలో నీతోడ్పాటు గావలసియుండును. నగరరక్షణార్థము నిన్ను విడిచిపెట్టి నేనొక్కడ నీమహాకార్యమును సాధింపఁజాలను. ఇతరులను నమ్మి విడుచుటయు శ్రేయస్కరముగా గనుపట్టదు. అయినను దీనిని నిర్వహించు సమర్థులు మన సామ్రాజ్యమున ననేకులుగలరు. సమర్థులలో సమర్ధుఁడును దండనాధాగ్రణియునగు మీతమ్ముఁడు గోవిందనామాత్యుఁడు గన్పట్టుచుండఁగా నొరులకై వెదుకనేల ? అతఁడు విశ్వాసపాత్రుఁడైన యోగ్యుఁడు, అతఁ డెట్టి ద్రోహచింతయును లేని బ్రాహ్మణుఁడు. అతఁడు తనబొందిలో ప్రాణము లున్నంతదనుక షరరాజులను విద్యానగరభూమియందుఁ బాదముపెట్టనీయఁడు. కావున విద్యానగరమునకు రక్షకునిగా గోవిందరాజ ప్రధానదండ నాధాగ్రఱిని నియమించుట శ్రేయ