పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


మున కేగినారా లేదా? నిజము చెప్పుడు లేనిచో రాయలకీ సమాచారము దెలిపితీరుద' ననఁగా తాతాచార్యులవారు 'రామకృష్ణా! నీవు దేవాంతక నరాంతకుడవు. నీతో నసత్య జెప్పినచో లాభము లేదు. వారవనితా గృహమునకు నేనేగినది సత్యమేకాని నీ పుణ్యమా యని యెవరితోడనుజెప్పి, నన్నపహాస్యము పాలుచేయకుము' అని - బ్రతిమాలిరి.

'అట్లయిన నన్నెత్తుకొని యిటునటు త్రిప్పుడు' అని రామకృష్ణుడు పలుక, చేయునది లేక తాతాచార్యుల వా రాతనిని భుజములపై నెక్కించుకొని యటునిటు తిరుగసాగిరి. అంతఃపుర సౌధముపై నున్న రాయలదిచూచి భటుల బిలిపించి 'ఓరీ! అడుగో ! తాతాచార్యులవారి భుజములపై రామకృష్ణు డెక్కినాడు. వెంటనే వాని నిటు లీడ్చుకొనిరని డనెను. రాయలు సంజ్ఞచేయుట చూచిన రామకృష్ణుడు వెంటనే క్రిందకురికి 'ఆచార్యులవారూ ! మహాపరాధిని క్షమింపుడు. మిమ్ము నేనెత్తుకొందును' అని ఆయన వలదనుచున్నను యెత్తుకొని గంతులు వేయసాగెను. ఇంతలో భటులువచ్చి, రామకృష్ణుని భుజములపై నెక్కియున్న తాతాచార్యులవారినిఁ గ్రిందఁ బడద్రోసి యీడ్చుకోనిపోయిరి. రాయలు ఇదియేమిపనిరా! తాతాచార్యుల వారిని గొనివచ్చిరి?' అని భటులనడుగ, వారు 'మహారాజా! పైనున్న వానినేగదా తాము తీసుకొని రమ్మని సెలవిచ్చినది?' అని యనిరి. రామకృష్ణుని యుపాయమునకు విస్మితుడై రాయలు మన్నించెను.


33 పాండురంగ మహాత్మ్యము

తెనాలి రామకృష్ణకవికి మొదట రామలింగమను పేరుగూడ కలదనియు, నితఁడు శివభక్తియుక్తుడై లింగపురాణము నాంద్రీకరించె