పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

55


ననియు గొందరు చరిత్రకారులు చెప్పుదురు గాని యీతడు రచించెనని చెప్పబడుచున్న లింగపురాంధ్రీకరణగ్రంథ మిప్పుడెచ్చటను గానరాదు. కాని యీతని విరచితములైన చాటుపద్యములలో గొన్నిటియందు రామలింగమనియే ప్రయోగించుకొని యున్నాడు.

ఉ. లింగనిషిద్ధుఁగల్వలచెంగని మేచకకందరుంద్రిశూ
     లింగని, సంగ తాళిలవలింగని కర్థమదూషితన్మృణా
     లింగనిఁ కృష్ణచేలుని హలింగని నీలక చన్ విధాతృనా -
     లింగని, రామలింగకవి లింగనికీర్తి హసించుదిక్కులన్.

పాండురంగ మహాత్మ్యము నీతడు గొన్నాళయినపిదప విష్ణుభక్తుడై విరచించెనని చెప్పుదురు. ఈ యుత్తమ కావ్యమును రామకృష్ణకవి యొక జాగీరుదారయిన పెదసంగమరాజుకడ ప్రధానిగా నుండిన విరూరివేదాద్రి కంకిత మొసంగెనని ఈ క్రిందిపద్యమువలన బ్రస్ఫుటమగుచున్నది. ఈ విరూరివేదాద్రిగురువు కందాళయప్పలాచార్యులవారు. ఈయన సారంగుతమ్మకవికిని గురువై యుండెను.

సీ. 'వేదమార్గ ప్రతిష్టాదైవత జ్యేష్ఠుఁ
               డభ్యస్త షడ్దర్శనార్థరాశి
     యతిరాజరిచిత భాష్య గ్రంథనిర్ణేత
               యఖిల పురాణేతిహాసకర్త
     బంధుర దివ్య ప్రబంధానుసంధాత
               పంచసంస్కార ప్రపంచచణుఁడు
     వాధూల మునిచంద్ర వంశవర్థనమూర్తి
               సకలదేశాచార్య నికరగురువు

గీ. పట్టమేనుంగు శ్రీరంగపతికినణ్ణ
    గారిగరాంబురాశి నాహారరస్మి