పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

29

రామకృష్ణకవి లేచి 'మహారాజా! మీరు సకలవిద్యావిశారదులు రాజ్యపరిపాలనా ధురంధరులు కావుననే పద్యమునకు సరియైన వెల నిర్ణయించినారు. ఈ పద్యమును భట్టుమూర్తి వ్రాయలేదు. వేయి దీనారములకు మన తిమ్మనకవిగడ గొనెను. మీరు వేయికిబైన నేమైన నిచ్చినగదా మన భట్టుమూర్తికి లాభము?" అనెను. భట్టుమూర్తి సిగ్గుపడెను.

మఱొకనాడుతిమ్మసకవియింటివద్దనందఱునుగూర్చుండికవితా గోష్ఠి గావించుచుండగా నామార్గమున బోవుచున్న భట్టుమూర్తి వారందఱును వినునట్లు తన శిష్యునుద్దేశించి --

క. వాకిఁట కావలి తిమ్మన
   వాఁకిట కవికోటి మాధవా కిటకోటే. '

యని, తిమ్మన వాఁకిటగూర్చుండిన కవులసమూహము పరాహముల సమూహమును బోలియుస్నదను నర్థము వచ్చునట్లు చదివెను. రామకృష్ణుఁ డా దారినిబోవుచు నది విని--

'న. ప్రాకృత సంస్కృత ఘూర్జర
     మూకీకృతకుకవితుంగ ముస్తాతతికీస్
     వాఁకిట కావలి తిమ్మన
     వాఁకిటి కవికోటిమాధవా! కిటకోటే.'

ప్రాకృత సంస్కృత, ఘూర్జర భాషలమిశ్రమముచేసి, కవనము చెప్పునట్టి కుకవులనుతుంగముస్తల పాలిటికిఁ దిమ్మనవాకిటనున్న కవులందరును వరాహములవంటివారేయను భావము వచ్చునట్లు చదువగా భట్టుమూర్తి సిగ్గుపడెను. ,

మఱిరెండు రోజులు గడిచినపిదప, ముక్కుతిమ్మనయొకనాడు తనయింటి చావడిలోఁ గూర్చుండి, ఊయెలలో నుల్లాసముగ నూగుచుండగా రామకృష్ణుఁడేగి 'మామా! ఊతునా! యనెను. ఊయల