పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


నూపును కాఁబోలునని భావించి, తిమ్మన ఊఁ యనెను. వెంటనే వికటకవి తిమ్మనమోముపై నుమిసెను ఆగ్రహావేశమునొంది. 'ఓరి నీకేమి పోగాలమురా ? నిన్నుమియమంటినా? యని తిమ్మన గర్జింప, 'అవును మామా! ఊతునా! యని నిన్నడిగియే గదా నేనుమిసినాను, అని, రామకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చెను, కోపమాపుకొన జూలక తిమ్మనకవి యూయలపై నుండియే రామకృష్ణుని మొగముపై శక్తికొలదితన్నెను. ఆతాపునకు రామకృష్ణుని దంతమొకటి యూడిపోగా, నాతడు యింటికి బోయి దుప్పికొమ్ము నరుగదీసి పన్నుగా నమర్చుకొనెను ఆసంగతి రామరాజభూషణుడు తెలిసికొనెను నాటి మధ్యాహ్నము కొలువుకూటమున రాయలు 'రవిగాననిచో గవి గాంచునేకదా!' యనుసమస్యను పూర్తిచేయుమనెను. భట్టుమూర్తి యిట్లు పూర్తిచేసెను.

ఉ. “ఆరవి వీరభద్రచరణాహతిడుల్లిన బోసినోటికిన్
     నేరడు రామలింగకవి నేరిచెఁబో మన ముక్కు తిమ్మన
     క్రూరపదాహతిం దెగిన కొక్కెఱపంటికి దుప్పికొమ్ము ప
     ల్గా రచియించెనౌం! రవిగాననిచో కవిగాంచునేకదా!”

రాయ లాపద్యభావమును గూర్చి యాలోచనాథీనుఁడై యుండగా భట్టుమూర్తి జరిగినదంతయుచెప్పి రాయల కాహ్లాదము గలిగించెను.


17 కవి గండపెండేరము

కృష్ణరాయ లొకనాడు బంగరుపళ్ళెరమున గవిగండపెండేరమును దీసికొనినచ్చి, గీర్వాణాంధ్రములందునమోఘముగా కవిత్వము జెప్పువారికి గవిగండపెండేర మీయఁబడునని చెప్పగా కవులందఱు నాలోచనాధీనులై యుండగా, రాయలు మఱల నిట్లనెను--