పుట:Telugunaduanuand00srirsher.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  
ఉ. అంతయునొక్క టే సకలమాత్మయె నీదిది నాదిదంచుకా
సంతయునెన్న రాదుతనయాలయ, దార, ధనాధులన్నీ యు౯
భ్రాంతులటంచుబ్రత్యహము పల్మరుఁదప్పక చెప్పి శుష్క వే
దాంతులుకొంపదోతురు కడాపటఁ జోగినిఁజేతు రజ్ఞుల౯.

చ. వలదనినేను చెప్పి గెలువంగలనా యికచాలుచాలు నే
తెలియకయొక్కటన్న నలుదిక్కుల న౯బడియండ్రుకాని లే
తెలిపెదఁదెంపునం దెలుఁగు దేశపుస్మార్తులవియ్యపొత్తుల౯
దలచిన ధర్మశాస్త్ర పరతంత్రులు గారనవచ్చువారల౯.

చ. చెలగినియోగిశాఖలను జేతురునియ్యము భేదమెంచ రు
జ్జ్వలమతులైన కొందరిక శాఖలు మూడును నాటినాటికి౯
గలయుచువచ్చుచున్నయవి గానియదేమొకొతక్కు భేదముల్
దళముగఁబట్టుకొన్న యవి దైవవశమ్ముననాంధ్రమండలి౯.

మ. వెలినాడు౯ దెలగాణెము౯ మురికినాడ్విఖ్యాతమున్వేగినా
డు లలింగౌసలనాడు నానయిదునాడుల్ ఋగ్యజుస్సామవి
ఖ్యలశాఖాశ్రయివారుద్రావిడులుసత్యాపాడు లార్వేలవా
రలు బల్ నందవరీకులు౯ దమిళవారల్ పాకనాటీలు; స్మా
ర్తులలోని స్తరిపొ త్తె వియ్యములపొత్తుల్లేవు వింతయ్యెడి౯,

మాధ్వులు


సి. జావులావని తురుష్క వ్యాహృతులు సెప్ప
                సౌకుభేశని స్వభాషలు వచింప
పంతులవారి ప్రభావంబు వెలయింప
       నాచార్య భావంబు నధికరింప
ఓర్పుతో రాజకీయోద్యోగములు సేయ
       ఘనభక్తి దేవతార్చనలు నెఱవ
భోగినీ యోగ సంభోగంబుచాటింప
       దీవిరిసాలగ్రామతీర్ధమాడ

గీ. చాల మిగాళ్ళదూల నీమాలఁదొడగ
తప్పకను మేనఁ బంచముద్రలు వహింప
లౌక్య వైదికములు చెవుల్ బట్టిలాగ
మాధ్వులొప్పుడు రీయాంధ్ర మండలమున.

సి. గట్టిగా నొకపట్టుపట్టించె నేని ము
                ప్పత్తుహోళిగతృణ ప్రాయమనును
స్వస్తుతిన్నమ్మదే వరదొడ్డ దేవర
      తెలియ ముఖ్యప్రాణం దేవరయను
పరనింద నిమ్మ దేవర యేను దేవర
      రుబ్బు గుండాకార రూఢిగనును
తత్వబోధలు సేయు తరినిజీవపదార్థ
      బేరెయీశ్వరవస్తు భేదయనును