పుట:Telugunaduanuand00srirsher.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  
ఉ. కేలఁ గలంబుపట్టిన వకీలుతనంబొనరించుచున్న నే
కాలము దీర్పుఁ జెప్పు, నధికారముఁ జేసిన గాకితాలు ద
స్త్రాలగుఁగాళ్లు కాయలగుఁదప్పకొడల్ కనగాచుకొన్న చూ
లాలి నిబోలు క్షుత్తుజెడు లౌకిక విప్రులలోన నొక్కట౯.

చ. అనుపమమేరుమందరగుహావళిమూయఁగవచ్చుఁ గాని యీ
మనుజులనోరుమూయదరమాయనుకొండ్రది యంతపట్టు న
మ్మనలవికో నియోగి తనపచ్చయె కాని సహింప డన్యుప
చ్చననుచు దానికేమి విరజాజులు రాజులుసైత మట్లనే,

మ. కొమరుంబాపటకడ్డమై మొగలిరేకుం దమ్మలంపాకు నం
దముమీర౯ జడచుట్టపైనిడిన సాదాబిళ్ళపైఁ బచ్చఱా
లుమురాళింపగఁ గూబకుట్టులునుఁ దాలూకాలఁ జిల్లాలమ
చ్చెములం దుద్దుల బుష్యరాగములఁడాల్చీకట్లుబో మొ త్తనె
య్య మునన్భర్తలబ్రీతిగొల్పుదురులౌక్య బ్రాహ్మణప్రేయసుల్'.

సాధారణ విషయములు


ఉ. కమ్మనిమాట యొక్కటి సుఖమ్ముగఁ జెప్పెద నాలకింపుడీ
యెమ్మెను భోజనంబులకు నేదయిన౯ శుభకార్యవేళల౯
రమ్మని యెంతబిల్చినను రారొకపట్టున లౌక్యభూసురుల్
బొమ్మనియెంతగెంటినను పోరొకపట్టున వైదికోత్తముల్

చ. మసలుచుగర్మ కాండమును మాయము జేసినరీతిజూచియు౯
బస లలిత ప్రవర్తనము బావినిఁద్రోచినభాతి జూచియు౯
వసుధ నియోగిసంధ్యయును వైదికు చేతివిడెంబటంచును౯
హసనము జేతురెల్లపుడు హా పెరవారలు కోడిగాలకు౯.

చ. పొసగు సమస్తమున్గలము పోటునమేటినియోగి కెప్పుడు౯
గొస కఖిలంబు వైదికునకు౯ సమకూరునుదర్భపోటున౯
వసుమతినేలువారలకు వచ్చుసమస్తము నీటెపోటున౯
బస ననికొందడిట్లు తెలుపందొరకొందురు కోడిగాలకు౯.

ఉ. ఈయిసుకోలుబళ్ళకడ నింగిలివీనులు పీసపాసుగాఁ మొ
గూయగఁజొచ్చి యామయిల గుడ్డలు సంకెదగిల్చిరండు
ఱ్రోయన నాలకింప రిసీలో కలికాలముగాలె రామరా
మాయనువృద్ధురాలయిన స్మార్తవితంతువుమాటిమాటికి౯.

ఉ. కమ్మనికందిపప్పు నురుంగారఁగఁగాచిన నేతిబొట్టు దూ
రమ్మునదానిగ్రమ్ముకొని రాఁబొగుపెత్తిన యాకుగూరలుం
గుమ్మడిపొట్ల కాకరము నుంగయు వంగయుదొండ బెండజే
కమ్ములుదప్పళంబులను గల్పిభుజింతురు శాలితండులా
న్న మ్ములు భ్రేవుమంచనుది నంబరటాకులలోన బ్రాహ్మణుల్

శా. అచ్చమ్మాయిదియేమిటే; రెయిలటే; ఆసీయిదేనా; సరే
బుచ్చమ్మా వినలేదటే, గడియలో( బోవచ్చునే కాశికి౯;
అచ్చోదేహముగ్రుద్దుకోదటె ఆయో ఆసౌఖ్యమేమందునే
యిచ్ఛారాజ్యమటండ్రు ట్రైనుగనియెంతేవింతవిప్రాంగనల్