పుట:Telugu merugulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

67


శ్రీ కృష్ణరాయని యాముక్తమాల్యదలో


“వీ డెంపుఁ బటు కేంపు విరిసి వెన్నెలగాయ
పరిగింజ నొకటఁ జిల్వరుస దోమ
సొరసి యెత్తిన మణుం గొందక మైనె నీ
గులుదేరఁ బసువీడి జలకమాడ
ముదుక గాకుండఁ బయ్యెదలోనఁ గేలార్బీ
కలయఁజంటను వెంటఁ గలప మలంద
రతిరయచ్ఛిన్న సూత్రమునఁ జిక్కక ముత్తె
ములు రాల గరగరికలు వహింపం
బొలసినని యెట్టి నరునైనఁ గులము దెలియఁ
బ్రభుత సెడి పల్లవుఁడు వేదవడిన నేద
నృపతి వెలియంతిపురముగా నెన్న మెలఁగ
భాసఁగృతి సెప్పవలంతు లప్పద్మముఖులు",


అన్న పద్యముగా మాఱినది.


ఇట్లు పొడిపొడిగాఁ బ్రాచీనాంధ్ర గ్రంథచ్ఛాయలు కృష్ణరాయల నాఁటి ప్రబంధములలో నెన్నంటినేని గుర్తింపవచ్చును. సర్వ ప్రబంధరచనా సౌభాగ్యములు పొసఁగియున్న 'పారిజాతాప హరణము'ను బురస్కరించుకొని ప్రబంధకవితావిశేషములఁ గొన్నింటిని బేర్కొందును. పారిజాతాపహరణకథాకల్పన మొక ప్రశస్తనాటక కథా కల్పనము! ఎట్లనఁగా -


శచీదేవినగరిలో దేవేంద్రుఁ డుండఁగా శ్రీకృష్ణుని దర్శించుటకై భూలోకమునకుఁ బోఁగోరి దేవర్షియగు నారదుఁడు ప్రభు వగు దేవద్రుని