పుట:Telugu merugulu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు


శ్రమసాధ్యమైన గ్రంథముద్రణ భారాన్ని ఇతరసహాయ నిరపేక్షంగా సమర్థంగా పర్యవేక్షించిన శ్రీవేటూరి ప్రభాకర వాజ్మయ పీఠనిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ప్రత్యేకంగా మా విన్నప మాలించి పవిత్రమైన ఈ బృహత్తర కార్యభారాన్ని కర్తవ్యంగా భావించి తలకెత్తుకోన్న తిరుమల తిరుపతి దేవస్థానము పాలకమండలివారి ఔదార్యాన్నీ శ్రీకార్యనిర్వహణాధికారుల సౌజన్యాన్ని కొనియాడుతున్నాము. పాఠకలోకం నోచుకొన్న ఈ భాగ్యానికి వారి నభినందిస్తున్నాము. పాఠకుల ప్రోత్సాహమే అందరికీ ఆనందము.


హైదరాబాద్ 29.01.08

(డా॥ వేటూరి ఆనంద మూర్తి) శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి స్మారక ట్రస్టు పూర్వాధ్యక్షుడు.