పుట:Telugu merugulu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు


కృతజ్ఞతలు


శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారి వాజ్మయ వ్యాసముల నన్నిటిని బృహత్సంపుటంగా - శ్రీప్రభాకరసంపూర్ణ గ్రంధావళిలో భాగముగా ప్రకటించుటకంటే పూర్వము ఎంతో కాలముగా విజ్ఞపారకలోక మెదురుచూస్తున్న 'తెలుగు మెఱుగులు', 'మీగడ తలకలు', సింహావలోకనము, మున్నగు గ్రంధములను తిరుమల తిరుపతి దేవస్థానము పాలకమండలి వారితీర్మానము సంఖ్య 269, తేది. 25.07.2007 మేరకు రూపుదిద్దుకొన్న శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయ పీరమువారు శ్రీప్రభాకరసంపూర్ణ గ్రంధావళి ప్రకటనకు పూనుకోవడము తెలుగువారు హర్షించే విషయము. అశేష పొఠకలోకము నలరించిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి "తెలుగు మెఱుగులు" ఇప్పుడు మీ ముందున్నది.


ఇదే క్రమంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వాజ్మయ రచన లన్నీ తిరుమల తిరుపతి దేవస్థానము వారి నిర్వహణమున అనతికాలంలోనే పడివడిగా వెల్లడి కాగల వని నమ్ముతున్నాము. శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి గారి వాజ్మయామృతధారను గ్రోలనివారు, కలియుగ ప్రత్యక్ష కులదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపావర్షధారలో తడియనివారు మన దేశమున లేరంటే ఆశ్చర్యము లేదు.