పుట:Telugu merugulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

తెలుఁగుమెఱుంగులు


పరమప్రయోజన మనవచ్చును. భాష చెందు క్రమపరిమాణపు మెట్లలో ఉత్తమకావ్యరచన కడపటి మెట్టు. వాడుక భాష అను ముడిసరకునుండి ఉత్తమకావ్య మసు సున్నితపు మేల్మిసరకు తయారవుచుండును. అయినను భాషాప్రయోజనము లన్నింటికిని ఈ మేలిమిసరకు ఉపయోగపడదు. వాడుకభాష మంచినీటివలె బహుప్రయోజనము కలది, కావ్యభాషపంచదారపానకమువలె పరిమితప్రయోజనము గలది.

బ్రౌఢకావ్యప్రయోజన మొకటి విడనాడినచోఁ దక్కిన భాషా ప్రయోజనము లన్నిటిలోను. వాడుకభాషయే ఓలలాడుచు నున్నది. కొందఱు సంస్కృతాంధ్ర కవీశ్వరులు శాసన కావ్య మను పేరుతో ప్రొడగద్య పద్యరచనలలో వెలయించినను ప్రాచీన శాసనము లెన్నియో వాడుక భాషలో నున్నవి.

ఇంకను ప్రాచీనకావ్య వ్యాఖ్యానములు, కథలు, శాస్త్ర గ్రంథములు, వ్యవహార గ్రంథములు, దేశచరిత్రలు చాలచాల వాడుకభాషలోనే ఉన్నవి. వాని నన్నిటిని ఉదాహరించుట కిక్కడ చోటు చాలదు. శ్రీగిడుగు రామమూర్తిపంతులుగారి గద్యచింతామణిలో చూచుకోవచ్చును. ఇంకను పద్యగంధులయిన బాలకథలు, పొడుపుకథలు, నాసుళ్ళు, పలుకుబళ్లు, సామెతలు, స్త్రీలపాటలు, పదాలు, పనిపాటులవారి పాటలు, పదాలు, వృద్ధుల వేదాంత వైరాగ్యపు పాటలు, పదాలు, ఎఱ్ఱగొల్లలు, పిచ్చుకుంట్లు,పంబవారు మొదలగువారు పాడు చేసికథారచనలు అన్నియు వాడుకభాషలోనే ఉన్నవి. ఇవికూడ వాజ్మయములో చేరునా అని పండితులు కొందఱు పరిహసించుచుందురుగాక! వానిరుచి గుర్తింపఁగల్గుటకుఁ గూడా నొక యనుభావవిశేషముండవలెను. ఒక్క తార్కాణ చూపు చున్నాను. చల్లపల్లి జమీందారు గారి పట్టాభిషేకోత్సవపు నాళ్లలో వారి కోటలో రాత్రులు


గూడ నొక యనుభావవిశేషముండవలెను. ఒక్క తార్కాణ చూపుచున్నాను. చల్లపల్లి జమీందారుగారి పట్టాభిషేకోత్సవపు నాళ్లలో హరికోటలో రాత్రులు