పుట:Telugu merugulu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

165


వర్గానునాసికములకుఁ బెట్టవలసిన చంద్రకళ ఒక్కటి గలవు. ఈ రెంటిని జేర్చుకొనఁగా ముప్పదియే డగును. ఇప్పుడు ముద్రణములకై యుపయోగింపఁబడుచున్న చిహ్నములు 500 లలో 468 తగ్గి పోయినవి. ముద్రణమున కీ మార్పు అమితోపకారకముగదా!


ఈ మార్పునుబట్టి టైపుమీషనును సృష్టించుట కడుసుకరముగదా! దంత్యములగు చజలకు వేలు లిపు లక్కఱ లేదు. ఇప్పుడు వాని భేదము నెవ్వరును లిపిలో పాటించుట లేదుగాని కావలెనని యభిమానించు వారికై ప్రత్యేకలిపి కల్పించితిని. రేఫముసకుఁ బూర్వపులిపిలో వలపలిగిలక -౯ అను చిహ్నమును, నకారమునకు ” అను చిహ్నమును గలవు. ఈ లిపు లభిమానింపఁ దగినవి. కాని వలపలిగిలక 'వగ౯ము' అను విధమున వ్రాయఁబడును. ఇది 'వ౯గము' అనువిధమున మార్చుట ఉచ్చారణాను గుణము. అప్పుడది డాపలిగిలక యగును. ఇష్టమేని వీని నుంచుకొన వచ్చును. అనిష్టమేని మానవచ్చును. కర్ణాటాంధ్రలిపులకుఁ జాల సాన్నిహిత్యమున్నది గాన, ఉభయలిపులకు నైక్యము కలుగుట యుభయ దేశముల వారికిని జాల లాభకర మని నా యీ సంస్కారములో కర్ణాటలిపిరీతిని కొంత చేకొనుటయ్యెను. ఉభయలిపులకు నైక్యము పొసగుట నాకోరిక.