పుట:Telugu merugulu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

తెలుఁగుమెఱుంగులు


మాక్రమించునదిగా నుండునేని యది ప్రాజ్ఞసమ్మతము గాకపోవచ్చును. కాని యీ సంస్కారము నిజముగా నట్లు హెచ్చుస్థల మాక్రమించుకొనదు. వ్రాతలో నించుకంత స్థలము హెచ్చుతగ్గు లగుటలోఁ జి క్కుండదు. అచ్చులో స్థలము పెరుగుటమాత్రమే చిక్కు అచ్చులో లిపిక్రింద లిపీ నుంచి కూర్చినట్టు కన్పట్టుచున్నదే కాని, వాస్తవమునకు (హాఫ్ బాడీ తప్పు) ప్రక్కనే ఉండును, వానిని గూర్చుటలోఁ గొంచె మించుమించుగా విడఁబలిచి వ్రాసిన నెంత స్థల మాక్రమించుకొనునో యంతస్థఫలమును వెనుక ముందుల ఆ 'స్పేసు' ఆక్రమించుకొనుచున్నది. పైగా బంతి వంకరవోవుచున్నది. అట్టి సంయుక్తాక్షరములు గల బంతికొఱకయి కొన్ని 'లెడ్లు' ఎక్కువ వేయవలసివచ్చుచున్నది. కాన వీనిని గలిపి కట్టుకొనినచో నంతగా నీ మార్పు హెచ్చుస్థల పక్రమించు కొనునది గాదని యేర్పడును. మఱియు ఋ,ౠ, ఘు,ఝ,మ,యలు, హలలో జరపఁబడిన మార్పులవలని స్థలలాభము కొంత గలదు.కావున నిది యంత యనర్ధావ హము గాదని నాతలంపు. అఱవలిపి యీ విధముననే కలదు. అందు లిపి క్రింద లిపి చేరదు.దానివలన వారి కెట్టి యసౌకర్యమును లేదు.


ఈ మార్పుచే హల్లుల యొత్తులు . a మొదలగునవి అక్కరలేక పోవును. అజ్ఞుణిత చిహ్నములను వేఱుగాఁబోఁతపోసి తలకట్టులేకుండఁ బోసిన హల్మాత్రములమీఁదఁ జేర్చుటకు వీలు గలుగును. సంయుక్తాక్షర మందలి హల్మాత్రములు తలకట్టు లేకుండఁ బూర్వముననుండి కడపటి హల్లు అచ్చుతోఁ గూడియుండుట గుదురును. మొత్తము లిపియెల్ల నిట్లు మార్పఁగా నచ్చుకై పోఁతపోయవలసినరేఖాచిహ్నములు ముప్పదియైదుమాత్రమే యగును. వర్గద్వితీయచతుర్ధములకు, ళ,అ,ష - లకుఁబెట్టవలసిన ఒత్తుగీఁత యొక్కటి,